సాధారణంగా రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా చాలామందికి ఆకలిగా అనిపించి ఏదో ఒకటి తింటారు. ముఖ్యంగా నీటిలో నానబెట్టి , ఉడకబెట్టిన వాటిని తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. నేటి జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు కూడా బరువు పెరిగిపోతున్నారు. ఈ సమస్య ఇప్పుడు అందరిలో కూడా సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా అధిక బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రజలు కూడా రకరకాల ఉపాయాలను పాటిస్తూ ఉంటారు. బరువు తగ్గడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.

చాలామంది గంటల తరబడి జిమ్ లో చెమటలు పట్టిస్తారు. మీరు కూడా మీ శరీర బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు తినే ఆహారంలో తెల్ల సెనగలను చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా బరువు తగ్గడానికి తెల్ల శనిగలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం.

పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 28 గ్రాముల తెల్ల సెనగలలో 102 క్యాలరీలు మన శరీరానికి లభిస్తాయి.  వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల 40 శాతం ఫైబర్, 22% ఐరన్,  70% ఫోలేట్ లభిస్తుంది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తుంది. ఫలితంగా మీరు బరువు కూడా తగ్గుతారు.. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించడానికి ఈ తెల్ల సెనగలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అధిక రక్తపోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. తెల్ల సెనగలలో పీచు పదార్థాలతో పాటు ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఆహారంలో వీటిని తినడం వల్ల సులభంగా 25% శరీర బరువును నియంత్రించవచ్చు అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్రోటీన్ సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే వీటివల్ల గ్యాస్,  అజీర్తి సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యంగా అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: