గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 3వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది.. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..

1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.

ప్ర‌ముఖుల  జననాలు..

1715: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (మ.1787)
1914: మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008). సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షా పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్‌ షా (ఏప్రిల్ 3, 1914 – జూన్ 27, 2008). 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు.[1] మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను 'శ్యామ్‌ బహదూర్‌' అని పిలుచుకుంటారు.
1955: హరిహరన్, భారతదేశ గాయకుడు. హరిహరన్‌ కేరళ లోని తిరువనంతపురంలో 1955 ఏప్రిల్‌ 3 న ఓ తమిళ అయ్యర్‌ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అలమేలు, హెచ్‌.ఎ.ఎస్‌.మణి ప్రముఖ కర్ణాటక శాస్ర్తీయ సంగీతకారులు. ముంబయిలో పెరిగాడు. ముంబయిలోని ఐ.ఐ.ఇ.ఎస్‌ కళాశాలలో సైన్స్‌, న్యాయశాస్త్రంలో డిగ్రీలను పూర్తిచేశాడు. ఆయన తల్లిదండ్రులు శ్రీమతి అలమేలు, అనంత సుబ్రహ్మణ్య అయ్యర్లు. ఆయనకు వారసత్వంగా సంగీత విద్య అబ్బింది. హరిహరిన్‌ తల్లి అలమేలు ఆయనకు తొలి గురువు. చిన్నతనంలోనే కర్నాటక సంగీతాన్ని నేర్చుకున్న ఆయన హిందూస్తానీ సంగీతంలో కూడా శిక్షణపొందాడు. ఆయన హిందూస్థానీ సంగీతం కూడా బాల్యంలో నేర్చుకుననరు. కౌమరదశలో ఆయన "మెహ్దీ హసన్", "జగ్జీత్ సింగ్" వంటి గాయకుల ప్రభావానికి లోనయి గజల్ సంగీతాన్ని అభివృద్ధి పరచుకున్నాడు. ఆయన "ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్" వద్ద హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆయన ప్రతిరోజూ 13 గంటలకు పైగా సంగీత సాధన చేస్తుంటారు.
1961: ఎడీ మర్ఫీ, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు.
1962: జయప్రద, తెలుగు సినీనటి, పార్లమెంటు సభ్యురాలు.
1965: లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ), సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో హైదరాబాదు‌లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాదు‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌.
1973: నీలేష్ కులకర్ణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
1973: ప్రభు దేవా, భారతదేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1680: ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు. (జ. 1630)
2010: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925)

మరింత సమాచారం తెలుసుకోండి: