భారతదేశంలో నిర్మించబడ్డ ఎన్నో పురాతన దేవాలయాలు.. ఒక్కో దేవాలయం ఒక్కో విశిష్టతను కలిగి ఉండడంతో పాటు ఇప్పటికీ కొన్ని రహస్యాలను ఆ  దేవాలయాలు తమలో దాచుకున్నాయి. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దం నుంచి నిర్మించబడిన దేవాలయాలు ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని , ఇప్పటికీ పర్యాటకులకు ఆకర్షణగా నిలుస్తున్నాయి అంటే ఇక ఈ నిర్మాణాలను ఎంత గొప్పగా నిర్మించారో ఊహకు కూడా అందనిది. అయితే మన భారతదేశంలో ఎన్నో సంవత్సరాల కిందట నిర్మించబడిన ఈ దేవాలయాల రహస్యాలను ఇప్పటికీ చేదించలేకపోతున్నారు.

అలాంటిది ఇప్పుడు కూడా ఒక దేవాలయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ దేవాలయం కు రాత్రి సమయంలో వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదట. పైగా అక్కడే రాయిలాగా మిగిలిపోయారు అని చరిత్ర చెబుతోంది..ఇది వినడానికి కొంచెం నమ్మశక్యం గా వున్నా  ఇదే నిజం అని అంటున్నారు తెలిసిన చరిత్రకారులు అదేమిటో తెలుసుకుందాం.
కిరాడు దేవాలయం అనే ఒక దేవాలయం ఉంది. ఇక ఈ దేవాలయం పేరు లాగానే రాత్రి సమయంలో ఈ దేవాలయంలో అడుగుపెడితే రాయిలాగా మారి పోతారట. అంతేకాదు ఈ ఆలయం నుంచి రకరకాల అరుపులు , శబ్దాలు కూడా వినిపిస్తాయట. రాజస్థాన్లోని బికనీర్ నుంచి జెయి సల్మెర్ వెళ్లే ప్రాంతం. ఇక ఈ ప్రాంతంలో వివిధ రకాల పేర్లతో , ఊర్లో ఇసుక దిబ్బలు ఇలా రకరకాలుగా వింత వింత ప్రదేశాలను మనం గమనించవచ్చు. అక్కడ ఉన్న ఒక గ్రామం హాత్మ.. పేరుకు తగ్గట్టుగానే ఈ ఊరిలో కూడా ఎన్నో రకాల వింతలను మనం చూడవచ్చు.
ఈ ఊరిలోనే ఐదు దేవాలయాల సమూహం ఉంది. అందులో ఒకటి వైష్ణవ దేవాలయం. ఈ దేవాలయాల కట్టడం లో నిర్మించిన ఎన్నో కళాకృతులు ఖజరహో ను మనకు గుర్తుకు తెప్పిస్తాయి . అందుకే రాజస్థాన్ ఖజరహో గా ఈ దేవాలయాలు గుర్తింపు పొందాయి. క్రీస్తు శకం 11 వ శతాబ్దం లో చాళుక్య రాజులు దీనిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దాదాపు వంద సంవత్సరాల పాటు వైభవంగా జరిగిన ఈ దేవాలయాలు.. పేరు ఇప్పుడు చెప్పగానే ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా భయపడిపోతారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులతో కిటకిటలాడే ఈ దేవాలయాలు ఇప్పటికీ రాత్రి సమయం కాగానే ఒక్కరు కూడా అక్కడ ఉండరట. అంతే కాదు పైగా అక్కడ ఉండవద్దు అని హెచ్చరిస్తున్నారు కూడా. అంతే కాదు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ సమయంలో మేము రాము అని చెబుతారు అంట అక్కడ ఉన్న గ్రామస్తులు. అసుర సమయంలో దేవాలయాలు మొత్తం కిరాతకంగా మారిపోయి, అక్కడ వాతావరణం కూడా చాలా భయానకంగా వుంటుంది.అర్ధరాత్రి దాటితే చాలు వింత అరుపులు, శబ్దాలు విని చనిపోవాలని అనిపిస్తుందట.


ఏడుపులు ,పెడబొబ్బలు కూడా వినిపిస్తాయట.అయినా పర్లేదు అని అక్కడే ఉండిపోయారో ఉదయాన్నే శిలగా మారడం ఖాయమట. అయితే ఈ మిస్టరీని ఒక శాస్త్రవేత్తల బృందం చేధించడానికి వెళ్లగా, వారు భయంతో పరిగెత్తి వచ్చారట .అక్కడేదో శక్తి ఉందని దాన్ని అంతం చేయడం  అసాధ్యమని ఇప్పటికీ ప్రచారం ఉంది. అయితే ఇది నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం అని చెబుతున్నారు చరిత్రకారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: