యోగా శారీరక,మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది.దీని మూల ఆధారం శివుడని అందుకే ఆయన యోగా పితామహుడు అని హిందువులు నమ్ముతుంటారు.కాని చరిత్రకారులు పతంజలి యోగా  పితామహుడు అని అంటూవుంటారు. ఈ యోగా  అయిదవ శతాబ్దం క్రీస్తు పూర్వం నుండి వేదాలలో కనిపించడం మొదలైంది.ఇది సంస్కృత పదం యూజా నుండి తీసుకోబడింది.దీని అర్ధం అనుసంధానం.

(UNGA) సంస్థ జూన్ 21 వ తేదీన 2015 లో యోగా   డే గా ప్రకటించింది.నరేంద్ర మోదీ 21 వ తేదీన యోగా   డే గా ప్రతిపాదించారు.దానికి UNGA వారు అంగీకారం తెలిపారు.21 వ తేదీ జూన్ నార్తేన్ హెమి స్పియర్ లో సంవత్సరం మొత్తానికి పెద్ద రోజు మరియు చాలా దేశాలలో ముఖ్యమైన రోజు అందువల్లే మోదీ యోగా   డే కు ఆరోజు ను ప్రతిపాదించారు.

భారతీయులకు యోగా  ఎంతో ప్రత్యేకం అందుకే నరేంద్ర మోదీ UNGA ప్రసంగం లో మొదటిసారిగా యోగా   డే ను ప్రతిపాదించారు.అదే యోగా డే పుట్టుకకు కారణం అయింది.యోగా   డే ను భారత్ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుతుంది.ఎప్పటి లాగే ఈసారి కూడా జార్ఖండ్ లో 30,000 వేల మంది సమక్షంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: