మన శరీరంలోని అవయవాల్లో గుండె చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అందువల్ల అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. ప్రస్తుతం జీవనశైలిలో అనేక మార్పులు సంభవించడంతో పాటు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె సంబంధింత వ్యాధులతో అనేక మంది హాస్పిటల్‌ల చుట్టూ తిరుగుతున్నారు. 
 
అయితే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే, మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం మనం నిత్యం తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు ఏమిటో ఓసారి చూడండి..
 
- ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంలో ఓట్ మీల్ తినాలి. ఓట్స్‌లోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
 
- చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.


- స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీస్ వంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే గుండెకు మంచిది. ఇందులో గుండెకు మేలు చేసే పెతోన్యూట్రియంట్స్ ఉంటాయి. 


- డార్క్ చాకొలెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
 
- వాల్‌నట్స్‌లో ఉండే మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. అందుకే వీటిని నిత్యం తినాలి. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలిగిపోతాయి. దాని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.


- క్యారెట్లు, స్వీట్ పొటాటోల్లో ఉండే కెరోటినాయిడ్‌లు, విటమిన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తీసుకోవ‌డం వ‌ల్ల గుండెకు ఎంతో మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: