మనిషి ఆహారం లేకపోయినా వారం రోజులు బతకగలడు కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ సమయం జీవించి ఉండలేడు. శరీరంలో నీటి శాతం తగ్గితే రకరకాల జబ్బులు వస్తాయి. నిజానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తీసుకోవాలి. కానీ చల్లని, ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు పైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని గోరు వెచ్చని నీళ్ళు తీసుకోవాలి. వీటివల్ల మరింత ఆరోగ్యంగా ఉంటాడు.


బరువు తగ్గుతారు: అధిక బరువును తగ్గించుకోవడం కోసం గోరు వెచ్చని నీరు బాగా ఉపయోగపడతాయి. ఉదయాన్నే పరగడుపున గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే నెలరోజుల్లో తేడా మీకే తెలుస్తుంది.


శక్తి పెరుగుతుంది: గోరు వెచ్చని నీటిని తగు సమయంలో తీసుకుంటే శారీరక శక్తి పెరుగుతుంది, జీర్ణాశయం శుభ్రపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు తొలిగి శక్తి పెరుగుతుంది.


కీళ్ళ నొప్పులు తగ్గుతాయి: కీళ్ళ నొప్పులు ఉన్న వారికి గోరు వెచ్చని నీళ్ళు ఔషధంలా పనిచేస్తాయి. కండరాల పనితీరుకు కనీసం 80శాతం నీరు అవసరపడుతుంది. గోరు వెచ్చని నీళ్ళు కండరాల పనితీరును మరింతగా మెరుగుపరుస్తాయి.


ముడతలు దూరమవుతాయి: పెరిగే వయసుతో ముఖంపై ముడతలు రావడం సహజం. దీన్ని తగ్గించుకోవాలంటే నిత్యం గోరువెచ్చని నీటిని తీసుకోవాల్సిందే. వీటిని తగు మోతాదులో తీసుకుంటే ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా ఉంటుంది.


చలిని పారద్రోలుతుంది: వర్షాకాలంలో బయటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటిని తీసుకుంటే ఒంట్లో వేడి పుట్టి చలి తగ్గుతుంది. దీంతో పాటు గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది: గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. అంతేకాక గోరు వెచ్చని నీటి వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, చెమట ఎక్కువగా పడుతుంది.


వెంట్రుకలను సంరక్షిస్తుంది: గోరు వెచ్చని నీటిని తీసుకుంటే వెంట్రుకలు రాలడం తగ్గి మరింత పొడవు అవుతాయి. నిగారింపుగానూ ఉంటాయి.


రక్త ప్రసరణ మెరుగుపడుతుంది: శరీరంలో జీవక్రియ సక్రమంగా ఉండాలంటే రక్తప్రసరణ క్రమంగా జరగాలి. శరీరానికి పూర్తి స్థాయిలో రక్తప్రసరణ జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గోరు వెచ్చని నీటిని తీసుకుంటే రక్తం చక్కగా సరఫరా అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: