వాల్‌నట్స్‌లో ఎన్నో పోషక విలువలున్నాయి. అవి తినడం వల్ల గుండె జబ్బులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండడమేకాకుండా, డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మేలు జరుగుతుంది. పలు రోగాలను దూరంగా ఉంచడంలో వాల్‌నట్స్ పాత్ర ఎంతో కీలకమైంది. అంతేకాదు వాల్‌నట్స్‌తో ఆరోగ్యంతో పాటు అందం కూడా పెంచుకోవచ్చు. వాల్‌న‌ట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. వాటి వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి.


డయాబెటిస్ పేరు వింటే చాలు జనాలు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా భారతీయుల్లో డయాబెటిస్ భారిన పడే ముప్పు ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడితే తీపి తినలేం, వేళకు తినకున్నా కష్టమే, ఎక్కువ తిన్నా కష్టమే. శరీరంలో ఇన్సులిన్ మోతాదు ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అయితే డ‌యాబెటిస్ ఉన్న వారు వాల్‌న‌ట్స్‌ను నిత్యం తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది. 


అలాగే వాల్‌నట్స్‌ తింటే మానసిక ఒత్తిడి మాయమవుతుందని చెబుతున్నారు. వాల్‌నట్స్‌ తినేవారు ప్రతి పనిని ఎంతో ఉత్సాహంగా చేస్తారు. కారణం వారిలో ఎక్కువ శక్తి ఉంటుంది. అంతేకాదు ఏకాగ్రత కూడా ఎక్కువే అని తేలింది. రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ తింటే మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తక్కువని అంటున్నారు. వాల్‌నట్స్‌ గుండె సంబంధ జబ్బులను తగ్గించి, మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయని గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: