రోజువారీ ఆహార అలవాట్లు, ఒత్తిడిలో పనిచేయడం,  రాత్రిపూట ఎక్కువగా మేలుకోవడం, జంక్ ఫుడ్ తినడం బరువు పెరగడానికి కారణాలు.  ఫ్యాట్ ఫుడ్ అధికంగా తీసుకుంటే.. 
దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలి.  కాని, ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదు అని అంటుంటారు.  
పైగా గంటల తరబడి కూర్చిని పనిచేయడం వలన కూడా బరువు పెరుగుతుంటారు.  ఇలా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వలన త్వరగా బరువు పెరగడమే కాకుండా, 
త్వరగా జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉంది.  

ఇక ఇదిలా ఉంటే,  పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కొందరు అనేక పాట్లు పడుతుంటారు.  ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు.  
ఆ అవసరం లేకుండా చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు.  అదెలాగో ఇప్పుడు చూద్దాం.  

దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ :  దాల్చిన చెక్కను మలాసా దినుసుగా ఉపయోగిస్తారు.  కొంచెం తీయగా ఉంటుంది.  కొంచెం ఘాటుగా ఉంటుంది.  
దాల్చిన చెక్కలో అనేక ఔషదగుణాలు ఉన్నాయి.  మొదట దాల్చిన చెక్కను పౌడర్ లా చేసుకోవాలి.  ఒక బౌల్ లో నీరు తీసుకొని దానిని బాగా మరగించాలి.  
అందులో రెండు చెంచాల దాల్చిన చెక్క పౌడర్ ను వేయాలి.  అలా బాగా కాగిన టీని ఫిల్టర్ చేసుకోవాలి.  అనంతరం అందులో కొద్దిగా తేనె వేసుకొని తాగాలి.  
ఇలా తయారు చేసిన టీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేముందు ఒక కప్పు, నిద్రపోయే ముందు ఒక కప్పు తీసుకోవాలి.  ఇలా కొన్ని రోజులు చేస్తే చాలు.. మీ శరీరంలో మ్యాజిక్ జరిగి బరువు తగ్గుతారు.
  

సబ్జా గింజల జ్యూస్ :  ఎండాకాలం రాగానే వంటింలో ఎక్కడో డబ్బాలో దాచి ఉంచిన సంబ్జా గింజలు గుర్తుకు వస్తాయి.  వాటిని అప్పుడు బయటకు తీస్తాం.  
అధిక బరువుతో బాధపడేవారు ఆ బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.  అదెలాగంటే ఓ కప్పులో సబ్జా గింజలను తీసుకోవాలి.  అందులో నీరు పోసి నానబెట్టాలి. 
అనంతరం ఓ గ్లాసులో నీళ్ళు తీసుకొని అందులో బాగా నానిన సబ్జా గింజలను రెండు స్పూన్లు వేయాలి.  అంటే సబ్జా గింజల జ్యూస్ రెడీ.  
ఈ జ్యూస్ ను రోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే శరీరంలోని అధిక కొవ్వు కరిగిపోతుంది.  అంతేకాదు, ఒంట్లో వేడి ఉన్నా తగ్గిపోతుంది.  ఇక ఈ జ్యూస్ ను ఇతర జ్యూస్ లలో లేదా, 
సలాడ్ లో భాగం చేసుకొని కూడా తీసుకోవచ్చు.  సబ్జా గింజల్లో శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటివి ఉంటాయి.  

పొటాటో :  పొటాటో అనగానే మనకు వేపుల్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైడ్ వంటివి గుర్తుకు వస్తాయి.  పొటాటోను నూనెలో వేయించి వీటిని తయారు చేస్తారు కాబట్టి వీటిల్లో ఫ్యాట్ ఉంటుంది.  
అధిక బరువుకు పొటాటో వేపుల్లూ ఒక కారణం అని చెప్పొచ్చు.  అయితే, ఇదే పొటాటోను అధిక బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు.  కాకపోతే వన్డే పద్దతి వేరుగా ఉంటుంది.  
అదెలాగో ఇప్పుడు చూద్దాం.  

రెండు బంగాళదుంపలను తీసుకొని తోలు తీయకుండా అలాగే ఉడకబెట్టాలి.  బాగా ఉడికిన ఆ దుంపను అలాగే తినేయాలి.  ఇలా చేయడం వలన బరువు తగ్గొచ్చు.  

ఇక పచ్చిగా ఉన్న రెండు బంగాళ దుంపలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి జార్ లో వేయాలి.  అందులో కొన్ని నీళ్ళు పోసి జ్యూస్ లా చేసుకోవాలి.  
ఈ జ్యూస్ ను అలాగే తాగేయ్యాలి.  ఇలా చేయడం వలన కూడా బరువు తగ్గుతారు.  

ఇక మూడో పద్దతి ఏమిటంటే.. బంగాళదుంపలను చెక్కు తీయకుండా ఉడకబెట్టాలి.  అలా ఉడికించిన దుంపను చెక్కు తీయాలి.  
అనంతరం పొటాటోను బాగా పేస్ట్ లా చేయాలి.  ఒక కప్పు పెరుగు తీసుకొని ఆ పొటాటో పేస్ట్ ను అందులో కలుపుకొని తినేయాలి.  
ఇలా చేయడం వలన శరీరంలో ఉండే అధిక కొవ్వు కరిగిపోతుంది.  అయితే, దీనిని తిన్న తరువాత ఓ నాలుగు గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: