అందమైన పలువరుసకోరుకునే ప్రతిఒక్కరికీ ప్రధమ శత్రువు చిగుళ్ల వ్యాధి. ఇది తెలియకుండానే దంత సౌందర్యాన్ని, పళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చిగుళ్ల వ్యాధి చిన్నగా పంటి మీద గార పేరుకుపోవటంతో ప్రారంభమౌతుంది. నెమ్మదిగా అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. క్రమేపీ అది తీవ్రమై చివరికి చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారటం, నొప్పి వంటి లక్షణాలతో బాగా వేధిస్తుంది. తగు చికిత్స తీసుకోకపోతే దంతాలు చాలా హాని చేకూర్చుతుంది. సాధారణంగా రెండు రకాలైన చిగుళ్ల వ్యాధులు ఉన్నాయి - అవి "గింజివిటిస్ మరియు పార్డోంటైటిస్ " గా ఉన్నాయి. 


జిన్గైవిటిస్ అనేది చిగుళ్ళ యొక్క వాపు అయినప్పటికీ, పార్డోంటైటిస్ అనేది చిగుళ్ళ యొక్క ఇన్ఫెక్షన్లు. ముఖ్యంగా చిగుళ్ళకు ఎక్కవుగా ఇన్‌ఫెక్షన్స్‌కు గురవుతాయి. చిగుళ్లపై పుండ్లు ఏర్పడి బ్యాక్టీరియాతో  చీము పట్టి, పళ్లల్లో రంద్రాలు ఏర్పడితాయి. దీంతో పళ్లు పుచ్చిపోయి నోటిలో అల్సర్లు ఏర్పడి జీర్ణవ్యవస్థ అంతా కలుషితమవుతుంది. నిజానికి, చిగుళ్ల సమస్యలు, దంత వ్యాదులు తలెత్తడానికి గల అసలు కారణం మన తీసుకునే ఆహార పానీయాలు.దీనికి ఆహారం, ఇతర పానీయాలు తీసుకున్న ప్రతిసారీ టంగ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. చిగుళ్లను వేళ్లతో గట్టిగా నొక్కి, ఆ తర్వాత వాటితో పాటు, దంతాలను మిగతా భాగాలను శుభ్రం చేసుకోవాలి.


చిగుళ్ల వ్యాధులను పట్టించుకోకపోవడం వల్ల కావిటీస్, పళ్ళు ఊడిపోవడం, అల్సర్ పుండ్లకు, మరియు గుండె జబ్బులకు కారణమవుతాయి.  అలాగే నోటి దుర్వాసన సమస్యను వైద్య పరిభాషలో హౌలిటోసిస్‌ అంటారు. దాదాపు 80 శాతానికి పైగా చిగుళ్ల వ్యాధి వల్లనే నోటి దుర్వాసన వస్తుంది. కేవలం 20శాతం మందిలో మాత్రమే ఇది అసిడిటీ, సైనసైటిస్‌, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ వల్ల కావచ్చు. ఇది ఒక సాంఘిక సమస్య. కాబట్టి అసాధారణమైన ఇతర పళ్ల సమస్యలను కలిగి ఉన్నప్పుడు - దీర్ఘకాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి చాలా పెద్ద సమస్యగా మారవచ్చు మరియు అనుకోకుండా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ముందుగానే జాగ్ర‌త్త‌లు వ‌హించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: