ఆస్త‌మా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరికి ఉరేస్తున్నట్టు, శ్వాస అందకుండా ఆయాసాన్ని పెంచేసి రోగికి చుక్కలు చూపించే ఉబ్బసం వ్యాధినే 'ఆస్తమా' అంటారు. ఇది నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తోడేటంత బాధపెడుతుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహర పదార్థాల సేకరణ వల్ల‌ ఆస్తమా స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. 


ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఆస్తమా వ్యాధి తీవ్రతలను తగ్గించే కొన్ని ఇంట్లో ఉండే ఔషధాల గురించి తెలుసుకుందాం..


నిమ్మ: రోజూ భోజన సమయంలో నిమ్మరసాన్ని తాగటం వల్ల‌ చర్మ ఆస్తమా వ్యాధి తీవ్రతలు తగ్గుతాయి. 5 గ్రాముల నిమ్మ, తేనె కలిపిన మిశ్రమం ఆస్తమా వ్యాధి తీవ్రతలను తగ్గించే ఔషధంగా చెప్పవచ్చు. 


ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: ఫిష్ ఆయిల్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శ్వాససంబంధిత సమస్యలకు చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యరకమైన ఫిష్ ఆయిల్‌ను తీసుకోవడం ఉత్తమం.


వెల్లుల్లి: 10 వెల్లుల్లి రెమ్మలను తీసుకొని, 30 మిల్లిలీటర్ల పాలలో కలిపి వాడటం వల్ల‌ ప్రారంభ దశలో ఉన్న ఆస్తమాను తగ్గించవచ్చు. ఆస్తమా వ్యాధి తీవ్రతలు తగ్గటానికి రోజుకి ఒకసారైన దీనిని తాగాలి.


ఆనియన్: శ్వాసనాళలంలో సమస్యలను మరియు ఆస్తమాను నివారించడంలో ఒక గొప్ప నివారిణి ఉల్లిపాయ . సింపుల్ గా లంచ్ అండ్ డిన్నర్లో ఉల్లిపాయలను చేర్చుకోవాలి. పచ్చివి తినలేనప్పుడు ఉడికించి తీసుకోవచ్చు.


తేనె: ఆస్తమాను తగ్గించే సాధారణ హనివారిణిగా తేనెను పేర్కొనవచ్చు.ఒక జగ్గు నిండా ఉండే తేనె ముక్కు శ్వాస రంధ్రాల‌ను శుభ్రపరుస్తుందని చాలామంది నమ్మకం. తేనె శ్వాస తీసుకోటాన్ని సులభతరం చేస్తుంది. 


మస్టర్డ్ ఆయిల్: ఆవనూనె శ్వాస సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గించి, శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది . ఇది నార్మల్ బ్రీతింగ్ కు సహాయపడుతుంది .


అల్లం: ఒక చెంచా అల్లం రసాన్ని, ఒక కప్పు మెంతులతో చేసిన డికాషన్‌ ను కలిపి ఆస్తమా వ్యాధిని తగ్గించే మంచి ఎక్స్పెక్టోరెంట్‌న్‌ తయారు చేయవచ్చు. మంచి రుచి కోసం తేనెను కూడా కలుపుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: