స‌హ‌జంగా బంగాళ‌దుంప‌లో ఎన్నో ర‌కాల వంట‌లు త‌యారు చేస్తారు. అలాగే చాలా మందికి బంగాళ‌దుంప వంట‌లను ఇష్ట‌ప‌డుతుంటారు. బంగాళ‌దుంప‌లో నీరు, కార్బోహైడ్రేట్ల‌ను పుష్క‌లంగా ఉంటాయి. మ‌రియు పిండి ప‌దార్థం,  పీచుప‌దార్థాలు, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల మెదడు పరిమాణంగానీ, పనితీరుగానీ మెరుగ్గా ఉంచుతుంది. శ‌రీరానికి శ‌క్తిని ఇవ్వ‌డంతో బంగాళ‌దుంప బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 


బ‌రువు త‌గ్గించ‌డంలో మ‌రియు డ‌యాబెటీస్ అదుపులో పెట్ట‌డంతో బంగాళ‌దుంప బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఓ అధ్యాయ‌నంలో తేలింది. అలాగే బంగాళ‌దుంపలో ఉండే పిండిపదార్థాలు మానవుడి మెదడు ఎదుగుదలకు చాలా స‌హాయ‌ప‌డుతుంది. బంగాళదుంప‌ల ర‌సాన్ని కొన్ని సంవ‌త్స‌రాలుగా అల్స‌ర్ల‌కు, న‌యాటికా నొప్పికి, బెణుకుల‌కు వాడ‌తారు. 


బంగాళ‌దుంప‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఇవి గుండె జ‌బ్బులు త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు ఫ్రీ రాడిక‌ల్స్ వ‌ల్ల ఏర్ప‌డే రుగ్మ‌త‌ల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌పడుతుంది. బంగాళ‌దుంప‌ల‌ను చాలా ఏళ్లుగా త‌ల‌నొప్పి ఉప‌శ‌మ‌నానికి ఉప‌యోగిస్తారు. మ‌రియు చ‌ర్య సౌంద‌ర్యాల‌కు బంగాళ‌దుంప చాలా బాగా ప‌ని చేస్తుంది. 


ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నా దీన్ని ఫ్యాక్‌లా వేసుకోవ‌చ్చు. అలాగే వీటిలో ఉండే యాంటీ క్యాన్స‌ర్ క‌ణాలు క‌లిగి ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ క‌ణాల‌ను పెర‌గ‌కుండా నివారిస్తుంది. వంట‌ల‌కే కాకుండా ఎన్నో విధాలుగా  ఉప‌యోగ‌ప‌డే బంగాళ‌దుంప తిన‌డం చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: