స‌హ‌జంగా మ‌నం తినే ఆహారంపై మ‌న ఆరోగ్యం డిపెండై ఉంటుంది. మంచి పోష‌క ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల అరోగ్యంగా, ఆనందంగా ఉండ‌గ‌లం. శరీరానికి శక్తినిచ్చేది పిండిపదార్థాలే. మెదడు, కండరాలు, కణాల ఆరోగ్యం బాగుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. అందుకే ఏ సీజ‌న్‌లో పండు ఆ సీజ‌న్ తీసుకోవాలి. అప్పుడే మ‌న శ‌రీరానికి కావాల్సి పోష‌కాలు అందుతాయి. సీజ‌న్ల బ‌ట్టీ అనారోగ్యాల‌కు, ఇన్ఫెక్ష‌న్ల‌కు గుర‌వుతుంటాం. కాబ‌ట్టి వీటి బారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి ఎలాంటి ప‌దార్ధాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం..


- పైనాపిల్ తింటే గాయాల వల్ల‌ కలిగే బెణుకులను మరియు నొప్పులను తగ్గించి వేస్తుంది. మ‌రియు జీర్ణాశయ శక్తిని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.


- అన్నంలో పిండిపదార్థాలు అధికం కాబట్టి ఎక్కువగా తింటే లావయిపోతామని చాలా మంది అనుకుంటారు. కానీ బరువు పెరిగేది శరీరంలో అదనంగా పేరుకుపోయే క్యాలరీల వల్ల. నిజానికి శరీరానికి శక్తినిచ్చేది పిండిపదార్థాలే. 


- ఆకు కూర‌లు తిన‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు మ‌రియు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.


- క్యారెట్ తిన‌డం వ‌ల్ల యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసి శరీరము లోని చెడు పదార్ధాలను తొలగిస్తుంది. మ‌రియు శరీర వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది. కాన్సర్ క‌ణాల‌ను నివారిస్తుంది.


- పసుపును మనం కూర‌ల్లో వాడుతుంటాం. దీని వ‌ల్ల శరీర సౌందర్యానికి, శరీర ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.


- దానిమ్మలో విట‌మిన్‌- ఎ, ఇ, సి, బి5లు పుష్క‌లంగా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా వేగ‌వంతంగా చేస్తుంది. అలాగే అందానికి మ‌రియు ఆరోగ్యానికి ఎంత‌గానూ ఉప‌యోగ‌ప‌డుతుంది.


- అల్లం వాడ‌డం వ‌ల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అలాగే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మ‌రియు  కొలెస్టరాల్ త‌గ్గించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.


- ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటి వ‌ల్ల ర‌క్త‌స‌ర‌ఫ‌రా, ఎముక‌ల వ్యాధుల భారిన ప‌డ‌కుండా ఉండ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో కొవ్వును త‌గ్గించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: