పొద్దున లేచిన దగ్గరినుండి రకరకాల ఆలోచనలు,చెప్పలేని టెన్షన్స్,అటు ఆఫీస్ పని,ఇటు ఇంటిపని.ఈ కాలంలో మనుషులకు సర్వసాధరణమై పోయాయి.ఈ ఒత్తిడిలో కామన్ గా వేధించే సమస్య మైగ్రెయిన్‌ ఇది ఎంతలా వేధిస్తుందంటే మనస్సును,స్దిరంగా వుండనీయదు,కాఫీ,టీలు అలవాటుంటే విపరీతంగా తాగేస్తారు.లేదా టాబ్లేట్ వెసుకుని పడుకుంటారు.మొత్తనికి మిమ్మల్ని చికాకు పెట్టిస్తుంది.అయితే ఈ తలనొప్పితో బాధపడేవాళ్లు బాదం గింజల్ని తిని చూడండి అంటున్నారు పరిశోధకులు.బాదం గింజల్లో నొప్పిని తగ్గించే పదార్థం ఉంటుంది.ఆ పదార్ధాన్నే యాస్ర్పిన్‌,అంటున్నారు మేరీలాండ్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు.



ఇక మైగ్రెయిన్‌ లేని వాళ్లతో మైగ్రెయిన్‌తో బాధపడేవాళ్లని పరిశీలిస్తే వీళ్లలో మెగ్నీషియం తక్కువ స్థాయిలో కనబడింది..బాదంలో మెగ్నీషియం సరిపడా ఉంటుంది. అందుకని బాదం గింజల్ని తినడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.లేదా భవిష్యతలో తలనొప్పి రాకుండా నివారించొచ్చు.మెగ్నీషియం మైగ్రెయిన్‌  నివారించడంలో ఎంత వరకు ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు చేసిన పరిశోధనలో అది 41.6శాతంగా ఉన్నట్టు వెల్లడైంది.పరిశోధనలో పాల్గొన్న వాళ్లకు ప్రతిరోజూ తగిన మోతాదులో ఈ పోషకాన్ని అందించాం.ఇందులో ఉండే లవణం కండరాలకు ఉపశమనం కలిగించడమే కాకుండా నరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.అందువల్లే ఒత్తిడి లేదా టెన్షన్‌ వల్ల వచ్చే తలనొప్పుల నుంచి బాదం ఉపశమనం కలిగిస్తుంది.




ఇదొక్కటే కాకుండా ఇందులో ఉండే విటమిన్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.బాదం గింజల్లో విటమిన్‌ బి2 మెండుగా ఉంటుంది.అందుకనే నాలుగువందల మిల్లిగ్రాముల బాదం తిన్న వాళ్లలో మైగ్రెయిన్‌ తరచుగా రావడం అనేది తగ్గిపోతుంది.మెగ్నీషియం,బి2 విటమిన్లు మైగ్రెయిన్‌ను తగ్గిస్తాయని మరోసారి నిరూపితమైంది’’అంటున్నారు పరిశోధకులు.మరింకేం మాత్రల్ని పిప్పర్‌మెంట్‌ బిళ్లల్లా తీసుకునే బదులు బాదం గింజల్ని తింటే అనారోగ్యం దూరమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆహారంలో బాదం గింజల్ని తీసుకోవడం మొదలుపెట్టండి.తలనొప్పిని నివారించుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: