ఇప్పుడు చాలా మంది ఎదురుకుంటున్న సమస్యలో ప్రధానమైన సమస్య మోకాళ్ళ నొప్పులు. దీనికి చాలా మంది ఇప్పుడు మోకాళ్ళకి చికిత్స చేపించుకుంటున్నారు. కాని కొన్ని సఫలం అవుతున్నాయి మరి కొన్ని విఫలం అవుతున్నాయి. కాని ఇప్పుడు ఇంట్లోనే ఒక మంచి తైలం ఎలా తయారు చేసుకోవాలో మోకాళ్ళ నొప్పులను ఎలా తగ్గించుకోవాలో ఒక మంచి చిట్కాని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:
ఆవదం చెట్లు యెక్క వేర్లు,
ఆకులు,
పువ్వులు,
కాయలు,
వావిలాకు-తగినంత,
ఉమ్మెత్త-కాయలు,
పువ్వులు,
ఆకులు-తగినంత,
మునగాకులు-తగినంత,
వామిటాకు-తగినంత,
నీళ్ళు-20 లీటర్లు,
ఆదం-తగినంతము,
ముద్ద కర్పూరం-1 కిలో,
మిరియాలు-1కిలో,
పిప్పర్లు-1కిలో,
తయారీ విధానం:

ముందుగా ఆముదం చెట్టు యెక్క వేర్లు,ఆకులు,పువ్వులు,కాయలు మరియు వావిలాకులు,ఉమ్మెత్త కాయలు,పువ్వులు,ఆకులు మరియు మునగాకు,వామిటాకు అన్నీ కలిపి ఒక పెద్ద గిన్నెలో వేసుకుని అందులో 20 లీటర్ల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి అవి 2 లీటర్లు వచ్చే అంతవరకు మరిగించాలి. ఇలా మరిగిన తరువాత పొయ్యి మీద నుంచి దింపి వాటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆముదం పోసుకొని దాంట్లో ముందుగా మనం తయారు చేసిపెట్టుకున్న కషాయాన్ని పోసి ఆ కషాయం నీళ్ళని ఇంకిపోయేలా ఆముదాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మిరియాలు మరియు పిప్పర్లను వేరు వేరుగా పొడి చేసుకొని ఉంచుకోవాలి.

ఇలా పొడి చేసుకున్న వాటిని మరుగుతున్న ఆముదంలో వేసుకోవాలి మరియు అందులో ముద్ద కర్పూరం వేసుకొని బాగా మరిగించుకుంటూ ఉండాలి. ఇలా మరిగించుకున్న తరువాత ఈ తైలాన్ని మనం నిలవ చేసుకొని పెట్టుకోవాలి. ఈ తైలాన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్న వారు రోజూ మోకాళ్ళకి రాసుకొని మర్ధనా చేసుకుంటా ఉంటే చాలు అంతే మోకాళ్ళ నొప్పులు మాయమవుతాయి. ఇలా క్రమం తప్పకుండా ఒక నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: