మీ పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారా. మారం చేశారని చిప్స్ ఇతర చెత్తంతా పెడుతున్నారా. అయితే బీ కేర్ ఫుల్ పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా టీనేజ్ లోనే అనారోగ్య సమస్యలు రావచ్చు. విటమిన్ లోపంతో కొత్త రోగాలు చుట్టు ముట్టొచ్చు నమ్మలేకపోతున్నారా బ్రిటన్ లో ఓ బాలుడు అదే పనిగా జంక్ ఫుడ్ తినడంతో చూపు కోల్పోయాడు. పదిహేడేళ్ళకే గుడ్డి వాడయ్యాడు. అంతేనా అతిగా చిప్స్ తినడంతో విటమిన్ లోపం ఏర్పడింది.


దీంతో వినికిడి సమస్య ఏర్పడింది. జంక్ ఫుడ్ అత్యంత ప్రమాదకరమని డాక్టర్ లు చెబుతున్నా పిల్లలు మారాం చేస్తున్నారని కొందరు తల్లితండ్రులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కానీ అదెంత ప్రమాదకరమో తాజా ఘటన చెబుతోంది. బ్రిటన్ కు చెందిన బాలుడు అదే పనిగా చిప్స్, వైట్ బ్రెడ్, ప్రొస్టేట్ మీట్ తింటూ వచ్చాడు. ఇదేదీ హైజనిక్ ఫుడ్ కాదు. దీంతో అతని శరీరంలో మార్పులు మొదలయ్యాయి. పధ్నాలుగేళ్లకే అతిగా ఆయాసం రావడం మొదలైంది. అయితే అప్పటికీ డాక్టరు దగ్గరికి వెళ్లినా ఎలాంటి చికిత్స తీసుకోక పోవటంతో పరిస్థితి మరింత ముదిరింది. దీంతో బాలుడు తినకూడని ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడంతో ఎంఆర్ ఎఫ్ ఐ డిజాస్టర్ వచ్చింది.


ఇది ఆ బాలుడ్ని గుడ్డివాడని చేసింది. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడంతో విటమిన్ లోపం ఏర్పడింది. విటమిన్ బి12 తక్కువగా ఉండటం ఇంజెక్షన్ ల ద్వారా అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు న్యూట్రిషన్ ఆప్టికల్ న్యూరోపతి సమస్య ఏర్పడటంతో చూపు నరాలు దెబ్బతిన్నాయి. దీంతో అతను చూపును పూర్తిగా కోల్పోయాడు. వినిపించడం కూడా ఆగిపోయింది. కావునా తల్లిదండ్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. పిల్లలకు అతిగా జంక్ ఫుడ్ ఇస్తే వారికి ఇటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువుగా వస్తాయని చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: