సాధార‌ణంగా ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది నిద్ర‌లేమితో బాధ‌పడుతున్నారు. కంటికి స‌రిప‌డా నిద్రలేకపోతే అది రుగ్మతలకు దారితీస్తుంది. మనసు మీద ప్రభావం చూపుతుంది. శారీరక జీవక్రియలు దెబ్బతింటాయి. నిద్ర తగ్గడం వల్ల‌ శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతోంది. మారిన జీవనశైలి, ఆలోచనలలో పెరిగిన వేగం, పోటీ ప్రపంచంలో అహోరాత్రులు కెరీర్‌పైనే దృష్టి, టీవీ క్షణాలు, మొబైల్‌ ముచ్చట్లు వంటివి మన నిద్రను దూరం చేస్తున్నాయి. కంటికి స‌రిప‌డా నిద్ర కావాలంటే జీవితంలో క్రమశిక్షణ పాటించడం తప్పనిసరి.


అలాగే సగటున బిఎమ్‌ఐలు ఉన్న ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులలో రోజూ రాత్రి ఆరుగంటలు కన్నా తక్కువ సమయం నిద్రపోయే వారిలో హార్మోనల్‌ మార్పులు కనిపించాయి. తక్కువ సమయం నిద్రపోయేవారు బ్లడ్‌షుగర్‌ స్థాయిలు నిలకడగా ఉండేందుకు మామూలుగా నిద్రించే వారికన్నా 30 శాతం అధికంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈపరిస్థితి అధిక బరువుకు దారితీస్తుంది. నిద్రలేమి, స్ట్రెస్‌ హార్మోన్‌గా పేర్కొనే కార్టిసాల్‌ను అదనంగా విడుదల కావడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిలో ఆకలి మరింత ఎక్కువవుతుంది.


ఈ క్ర‌మంలోనే నిద్ర రాకపోతే మనం తియ్యని, హెచ్చు కేలరీలున్న ఆహారం కోసం వెంపర్లాడతాం. కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉన్న కేలరీలు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాల పట్ల కోరిక 45 శాతం పెరుగుతుంది. అయితే మన ఆధీనంలో లేని ఎన్నో వివిధ అంశాలు మన శరీర ఆకృతులు, పరిమాణాలు, మన ఆకలి పెరగడానికి దోహదం చేస్తాయి. దీంతో శ‌రీరాంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్ వ‌ల్ల గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తుంది. అందుకే రాత్రివేళ‌ క‌నీసం ఏడు లేదా ఎనిమిది గంట‌ల నిద్ర త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: