సామాన్యంగా ఎవరింట్లోనైన పాలు విరుగుతే బయట పడేస్తారు.ఆ పాలు ఎక్కువగా వుంటే బయట పడేయాలంటే మనస్సు బాధగా అనిపిస్తుంది.అందుకే ఆ పాలు వృధాగా పోవద్దంటే ఇలా చేసి చూడండి.ఇది ఆరోగ్యానికి మంచి ప్రోటీన్స్‌ను అందిస్తుంది.ఇక దీని తయారుకు కావల్సిన పదార్ధాలేంటో,ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సినవి:
పాల విరుగుడు/ పనీర్ తురుము 1 కప్పు
పంచదార ఒక కప్పు
నీరు ఒక కప్పు
మైదా పిండి ఒక స్పూను
పెరుగు,నెయ్యి అర చెంచా
నూనె ఒక కప్పు
పచ్చ కర్పూరం చిటికెడు
ఇలాచి ఒకటి



తయారి పద్ధతి:
పాలు విరిగిపోయి ఉంటే సరే,లేక పోతే పాలు కాచేటప్పుడు మూడు చుక్కల నిమ్మరసం వేయండి.వెంటనే విరుగుతాయి.అలా విరిగిన పాలని ఒక జల్లెడలో తీసుకుని మొత్తం నీరంతా పొయేలా వడకట్టండి.కేవలం పన్నీరు మిగలాలి.నీరుంటే గులాబ్ జాం చుట్టడానికి కుదరదు.మరీ మీకు సందేహముంటే విరుగుడుని ఒక గిన్నెలో తీసుకుని పొయ్యి మీద మధ్యస్థంగా మంట పెట్టి ఐదు నిముషాలు తిప్పుతూ వుండండి.నీరు ఆవిరి అయిపోతుంది.అలా మిగిలిందే పన్నీర్ అన్న మాట.అదే రెడీమేడ్ గా దొరికే పన్నీరు అయితే ఇదంతా అవసరం లేదు.ఇక పన్నీరును తురుముకోండి చాలు.అలా మిగిలిన పాలవిరిగుడును,తీసుకుని పన్నీరు తురుము లో పెరుగు ,నెయ్యి,మైదపిండి వేసి బాగ ముద్ద లాగ అయ్యేలా కలిపి మూత పెట్టి పక్కన ఉంచండి.



తర్వాత పొయ్యి పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో పంచదార వేసి,నీరు పోసి బాగ కలిపి,పొయ్యి వెలిగించి లేత పాకం వచ్చెవరకు వుంచండి.పాకం కట్టాక పచ్చ కర్పూరం, ఇలాచి దంచి అందులో వేసి కలిపి పక్కన వుంచండి.ఇప్పుడు పన్నీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా మీకు నచ్చిన సైజులో చేయండి.పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో నూనె పోసి వేడి అయ్యాక ఈ వుండలని వేసి వేయించండి.మరీ ఎక్కువ మంట పై వేయిస్తే మాడిపోతాయి,కాబట్టి చిన్న మంట వుంచండి,ఇక నూనె మరీ పొగలు రావల్సిన అవసరం లేదు.కొద్దిగా వేడి ఐతె చాలు.అన్ని జాములను గొధుమ రంగు వరకు వేయించి చల్లారనివ్వకుండ పక్క ఉంచుంకోండి.ఇప్పుడు జామున్లను పాకం లో వేయండి.ఒక గంట తర్వాత వూరి బావుంటాయి.ఇంక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టి మరునాడు వడ్డిస్తే చాలా బావుంటాయి... 


మరింత సమాచారం తెలుసుకోండి: