ఈ భూమ్మీద మరో జీవి ప్రాణం పోసుకోవాలంటే అందులో ప్రముఖ పాత్ర స్త్రీ వహిస్తుంది. మగాళ్లు కేవలం ఒక బీజాన్ని ఇస్తే , దానిని తన పొట్టలో పెట్టుకొని తొమ్మిది నెలలయ్యాక ఆ బీజాన్ని బిడాగా చేసి బయటకు తీసుకొస్తుంది. ఆ క్రమంలో ఆమె ఎంత నరకయాతనను అనుభవిస్తూ మాటల్లో చెప్పలేము. ఒకేసారి ముప్పై రెండు ఎముకలు శరీరంలో విరిగితే ఎంత నొప్పి ఉండుతుందో అమ్మ కడుపు నుండి బిడ్డ బయటకు రావడానికి కూడా అంతే నొప్పిని భరించి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. అది అమ్మ అంటే.. 


వివరాల్లోకి వెళితే.. కొంతమంది భార్య భర్తలు పిల్లలను ఇప్పుడే కనకూడని అనుకుంటారు. ఒకవేళ గర్భం వస్తే దానిని పోగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు కొన్ని సార్లు అవి బేడీ కొట్టి తల్లి ప్రాణానికే ముప్పు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. క్షణకాల సుఖం కోసం ప్రాణాలను బలి ఇవ్వలేము కదా..అయితే, ఒక అబ్బాయి, అమ్మాయితో కలిసి రతి లో పాల్గొన్నప్పుడు ఎటువంటి గర్భం రాకుండా ఒక కొత్త మందు మార్కెట్లోకి రానుంది. అది కేవలం మగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. సెక్స్ ప్రేమికులు గర్భం వస్తుందని బయపడకండి.. 


ఎడిన్‌ బర్గ్‌ యూనివర్సిటీ, మాంచెస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి ఈ గర్భనిరోధక ఔషదాన్ని తయారు చేశారు. ఇన్నాళ్లు ఎంతోమంది మహిళలు పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఏవేవో మందులు వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని..భవిష్యత్తులో రాబోతున్న ఈ గర్భ నిరోధక ఔషధం కేవలం పురుషులకు మాత్రమేనని దానిద్వారా మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని పరిశోధకులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు పురుషులు కండోమ్ ద్వారానో లేక వేసక్టిమీ ద్వారానో పిల్లలకు అడ్డుకట్ట వేసేవారని ఇప్పుడు ఈ ఔషధం ద్వారా సంతోషంగా రతిలో పాల్గొనవచ్చని చెప్పకొస్తున్నారు. 


అసలు ఏంటి ఈ మందు ఎలా వాడాలి అనుకుంటున్నారా.. కలబంద గుజ్జులాగా కనిపించే నెస్టోరోన్ అనే ఈ జెల్‌ను వీపుకు గాని, భుజాలకు గాని పూసుకోవాలట. అలా పూసుకున్న అరగంటలో చర్మం ద్వారా శరీరంలోకి ఇంకిపోయి హార్మోన్ల ఉత్పత్తిని నిలిపి వేస్తుందని పరిశోధకులు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహిళలు ఉపయోగించే పిల్స్‌తో పోలిస్తే ఇది చాలా ఉత్తమమని పేర్కొన్నారు. అయితే దేవుడు సృష్టించిన ఈ భూగోళం మొత్తం మనిషి మనుగడకేనని మనందరికీ తెలిసిందే..ఒక మానవుడు విలాసవంతంగా, స్వేచ్ఛగా, సంతోషం, వినోదంతో బ్రతకడానికి ఎంతోమంది గొప్ప గప్ప శ్రాస్త్రవేత్తలు ఎన్నెన్నో కనిపెట్టారు ఇప్పటికి కనిపెడుతూనే వున్నారు. అయితే.. సృష్టికి విరుద్ధంగా కొంతమంది శ్రాస్త్రవేత్తలు చేసే ప్రయోగాలు ఎంతవరకు మానవ మనుగడకు ఉపయోగ పడతాయో అర్ధమవ్వట్లేదంటూ కొంతమంది నిపుణులు వాపోతున్నారు... మరి మందు అవాంఛిత గర్భం రాకుండా కాపాడుతుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: