అరటిపళ్ళు ప్రకృతి వర ప్రసాదం. అత్యధికంగా భూమిపై ప్రజలు తినే పళ్ళలో అరటి పళ్లదే ముందు స్థానం. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే అతి చవకైన, రుచికరమైన పళ్లు ఇవి. ప్రకృతిపరమైన సుగర్స్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ అధికంగా ఉన్న అరటిపండ్ల వినియోగం ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. క్రమం తప్పకుండా రోజుకు రెండు అర‌టిప‌ళ్లు తింటే కీలకమైన పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. అరటిపండులో నీటిశాతం కంటే ఘనపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థం కావడం వల్ల దీన్ని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా కూడా తీసుకోవచ్చు.


మగ్గిన అరటిపండ్లలో ఉండే టిఎన్‌ఎఫ్‌, శరీరంలోని కేన్సర్‌ ప్రేరేపిత కణాలను ఎదుర్కొంటాయి. టిఎన్‌ఎఫ్‌ శరీర కణాలకు, ఇమ్యూన్‌ సిస్టమ్‌ను అనసంధానిస్తాయి. ఫలితంగా కణాలు పోషకాలతో ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడైంది. యాంటి ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే అరటిపండ్లు శరీరంలోని ఇమ్యూనిటీని ఎర్రరక్త కణాలను పెంచేందుకు దోహదంచేస్తాయి. అరటిపండ్లపై చుక్కలుంటే మరింత ప్రయోజనం. ఇవి మరింత శక్తిని కలిగిస్తాయి.


కేన్సర్‌ నివారణకు తోడ్పడంతోపాటు కాన్‌స్టిపేషన్‌ చికిత్సలో దోహదం చేస్తాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో బవెల్‌ మూవ్‌మెంట్‌కు సహకరిస్తాయి. సోడియం శాతం తక్కువగా ఉండడంతో రక్తపోటును నియంత్రిస్తాయి. దీనిలోని పొటాషియం బిపి, ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపండ్లను తినడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండ‌వ‌చ్చు. ఇన్ని పోషకాలున్న అరటిపండును రోజూ తింటే డాక్టర్‌తో అవసరమే ఉండదంటున్నారు నిపుణులు..!


మరింత సమాచారం తెలుసుకోండి: