మహిళలు గర్భాధారణ కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువుపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి. అయితే గర్బిణీలు తినాల్సినటువంటి ఆహారాల్లో నెయ్యి ఒకటి. నెయ్యి తినడం వల్ల తల్లీ, బిడ్డకూ సురక్షితమని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేయండి..!


గర్భధారణ సమయంలో నెయ్యి తినవచ్చా అని చాలామంది సందేహిస్తుంటారు. ఇలాంటి సందేహాల వల్ల చాలామంది నెయ్యి తినడం మానేస్తారు. కానీ తగినంత నెయ్యి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మితంగా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగదు. అంతేకాక, ప్రసవం సులభతరం చేయడానికి సహాయపడుతుంది. శిశువు పెరుగుదల, మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలామంచిది.


ప్రతిరోజూ అన్నంలో ఒక చెంచా నెయ్యి కలిపి, తినడం వల్ల శిశువు పెరగడానికి సహాయపడుతుంది. మెదుడు ఆరోగ్య సంరక్షణకు నెయ్యి కూడా ఒక మంచి ఎంపిక. గర్భధారణలో తరచుగా వచ్చే ఆటంకాలలో డిప్రెషన్‌ ఒకటి. హార్మోన్ల మార్పులు గర్భిణీలో మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. నెయ్యి తినడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. ఊబకాయం ఉన్నవారు తప్పనిసరిగా డాక్టరు సలహాతోనే ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుని తింటే చాలా ఉప‌యోగ‌క‌రం.



మరింత సమాచారం తెలుసుకోండి: