ఈ బిజీ రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా నిద్రపోవడం వంటి కారణాల వల్ల మలబద్ధకం, రక్తహీనత, కాలేయంలో సమస్యలు, ఎముక పుష్టి తగ్గడం వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నివారణకు సాధారణంగా కంటే అదనంగా పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సిందే. ఇందుకు పోషకాలు పుష్కలంగా ఉండే  డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.


అందులోనూ ఎండు ద్రాక్ష వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో క్యాలరీల శక్తి అధికం. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. మ‌రి ఇందులో ఉండే పోషకాలు ఏమిటో.. అవి ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


- ఎండు ద్రాక్షలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారు రాత్రిపూట పడుకునే ముందు ఎండు ద్రాక్షతో పాటు సోంపును కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.


- స్త్రీలలో అధిక శాతం మంది రక్తహీనత కలిగి ఉంటారు. వీరు ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి.


- ఎండు ద్రాక్ష రోజు తినడం వల్ల శరీరంలో రక్తకణాలు, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేస్తాయి.


- ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీ అక్షిడెంట్ గా పనిచేస్తుంది. బీటాకెరొటీన్‌ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది.


- ఎండు ద్రాక్ష‌ను తరుచుగా తినడం వల్ల‌ శరీరంలో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: