వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో దాక్కున్న రోగాలన్ని బయటికి వస్తాయి.మనిషి శరీరంలో కూడా అప్పటివరకు లేని జబ్బులు చిన్నగా తొంగిచూస్తుంటాయి. అసలే సీజన్ వ్యాధులతో బాధపడుతుంటే,దోమలు,ఈగలు ఇవన్ని దోమలగాడి దండయాత్రలా మీదపడి మంచాన పడేస్తాయి.ఎందుకంటే వర్షాకాలం సీజన్‌..ఇక అందరం సహజంగానే పలు వ్యాధుల బారిన పడుతుంటాం.వాటిలో దగ్గు,జలుబు,జ్వరం కామన్‌గా వస్తుంటాయి.ఈ క్రమంలోనే ఆ అనారోగ్య సమ్యల నుంచి బయట పడేందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అయితే ఈ సీజన్‌లో దాదాపుగా ఏ వ్యాధి అయినా సరే.. కలుషితమైన నీటిని తాగడం,పరిశుభ్రంగా లేని ఆహారం తినడం వల్లే వస్తుంటుంది.అందుకని మనం తినే ఆహారాన్ని,తాగే నీటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.



ఇకపోతే సాధారణంగా ఆరోగ్య నిపుణులు మనకు పచ్చి కూరగాయలను తినాలని చెబుతుంటారు.దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చని వారి ఉద్దేశం.అయితే మిగతా సీజన్లలో అలా తింటే ఓకే.కానీ వర్షాకాలంలో కూరగాయలను పచ్చిగా తినక పోవడమే ఉత్తమమని కూడా వైద్యులు చెబుతున్నారు.ఎందుకంటే ఈ సీజన్‌లో ఉండే తేమ వాతావరణం వల్ల కూరగాయలపై అధిక సంఖ్యలో బాక్టీరియా,వైరస్‌లు ఉంటాయి.అలాంటప్పుడు వాటిని పచ్చిగా తింటే..ఇన్‌ఫెక్షన్ల బారిన పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుంది.కనుక మనం పచ్చిగా తినే క్యారెట్, టమాటా,బీట్‌రూట్..తదితర కూరగాయాలను ఉడికించి తినాలని వైద్యులు తెలుపుతున్నారు.ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చునట. వర్షాకాలంలో అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి.



ఎందుకంటే.ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.ఇక వీలైనంతగా కొన్ని వ్యాధులను రాకుండా చేసుకోవాలంటే ఇలా చేయండని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.మరిగించిన సలాడ్‌లు తీసుకోండి.ఆపిల్‌, దానిమ్మ,అరటిపండ్లను ఎక్కువగా తినాలి.ఇవి ఆరగించడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు.అల్లం, మిరియాలు,తేనె,పుదీనాతో తయారు చేసిన హెర్బల్‌ టీలు తీసుకోండి.వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి.తాజా ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు,జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్న, శనగపిండి,శనగలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.బ్రౌన్‌రైస్‌,ఓట్స్‌,బార్లీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వెల్లుల్లిని సూప్‌లలో,కూరలలో విడిగా వేయండి.ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.కాకరకాయ,పసుపు పొడి, మెంతులను ఆహారంలో భాగం చేసుకోండి.ఇవి ఇన్‌ఫెక్షన్ల బారినుంచి మిమ్మల్ని కాపాడుతాయి.ఆముదం,.పల్లి,నువ్వుల నూనె బదులు తేలికగా ఉండే మొక్కజొన్న నూనెను వంటలలో ఉపయోగించండి.ఈ సీజన్‌ను విజయవంతంగా ఆరోగ్యవంతులై దాటండి..


మరింత సమాచారం తెలుసుకోండి: