మారుతున్న కాలం, పెరుగుతున్న పొల్యూషన్, పెరుగుతున్న టెక్నాలజీ ఇవన్నీ ఒక యాదృచ్చికంగా జరుగుతాయి.. ఎలాగంటే ఏది సాధించాము అని మనవాళ్ళు సంబరపడేలోపల దాని పరిణామాలు మరోలా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ వరకు బాగానే ఉంది కానీ, తలెత్తే సమస్యలు కూడా మరింత ఎక్కువయ్యాయి. రాను రాను ఈ ప్రపంచం కంప్యూటర్ కాలం గా మారుతుంది. లేచినప్పటి నుండి పాడుకొనే వరకు అన్ని పనులను కంప్యూటర్ ద్వారానే సాగుతున్నాయి. 


విషయానికొస్తే.. ఈ కంప్యూటర్లు పెరిగినప్పటి నుండి అంతకు మించిన రేంజులో ఆసుపత్రులు కూడా పెరుగుతుండడం గమనార్హం. ఎందుకంటే ఈ కంప్యూటర్ల వాడకంతో కంటి సమాసాలు కూడా ఎక్కువవుతున్నాయి. అదే పనికి ఆ మానిటర్ ను చూడటం వల్ల అనేక రకాల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మనిషి శరీరంలో కళ్ళు అనేవి చాలా ముఖ్యమైన అవయవాలు. చేతులు, కాళ్ళు లేకున్నా బ్రతికేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ , లేకుండా జీవనాన్ని కొనసాగించడం మాత్రం కష్టం తో కూడుకొన్న పని. 


మామూలు వాళ్ళతో పోలిస్తే ఐటి ఉద్యోగుల్లో 76 శాతం మంది కంటి సమస్యలతో భాదపడుతున్నారట. ప్రతి పది మందిలో 7 గురికి కంటి సమస్యలు వున్నాయి అంటే సమస్య తీవ్రతరం ఎలా వుందో అర్థం చేసుకోండి .కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు అలసిపోతాయి, కళ్ళు మండటం మరియు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఇవే మనకు ప్రధానంగా కనిపించే సమస్యలు.


అయితే, స్క్రీన్ ను ఎక్కువగా చూడాల్సిన సమయంలో అదే పనిగా కళ్ళను చూడటం కాకుండా మధ్య మధ్యలో కళ్ళను ఆర్పుతూ ఉండాలి. అంతేకాకుండా దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. పని మధ్యలో కాస్త విరామం దొరికితే బయటకెళ్ళి పచ్చటి చెట్లను చూడటం వల్ల కొంతవరకైనా ఈ సమస్యను తగ్గించవచ్చు. కళ్ళకు గ్లాసెస్ ధరించడం ఉత్తమం. విటమైన ఏ పుష్కలంగా దొరికే ఆకు కూరలు, కూరగాయలను తినడం వల్ల ఈ కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. చూసారుగా ఎటువంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మీ కళ్ళను మీరే కాపాడుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: