డాక్టర్ల గౌరవం కాపాడేందుకు ప్రయత్నిస్తానని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈర్ల రాజేందర్  స్పష్టం చేశారు. ఆత్మగౌరవంతో  అంతస్తును బట్టి ఉండదు. మనిషిని బట్టి ఉంటుందన్నారు.  కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నారు. కావాల్సిన సదుపాయాలన్ని ఏర్పాటు చేస్తాను.. పేదవాడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎనిమిది గంటలపాటు డాక్టర్ల తో  ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య చరిత్రలో మొదటిసారిగా వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటల్స్ లో ఉన్న విభాగ అధిపతులతో మాత్రమే కాకుండాడాక్టర్స్ తో కూడా మంత్రి ఈటల రాజేందర్  ముఖా ముఖి జరిపారు. గాంధీ ఆసుపత్రి తో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మంత్రి అన్ని టీచింగ్ హాస్పిటల్స్ వారితో ఫేస్ టు ఫేస్ నిర్వహించతలపెట్టారు.


గాంధీ మెడికల్ కాలేజీలో 8 గంటల పాటు డిపార్ట్మెంట్ ల వారీగా డాక్టర్స్ తో ముఖాముఖి గా మాట్లాడిన మంత్రి ఈటల. గాంధీ ఆసుపత్రికి వచ్చేవారు అతి పేద వారు అందులోను అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు వస్తున్నారన్నారు. వారికి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.  డాక్టర్స్ మీద దాడులు రూపు మాపడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.  గాంధీ, ఉస్మానియాలకు చివరిదశలో ఉన్న రోగులు వచ్చే అవకాశం ఉంది.. ఇక్కడ వైద్య పరికరాల కు, డాక్టర్స్ కి, నర్సులు కొరత లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ఎజెండా. అన్నారు. ఏడోవ పే కమీషన్ ప్రకారం జీతాలు పెంచాలని అడిగిన డాక్టర్స్ డిమాండ్ కి మంత్రి ఈటెల సానుకూలంగా స్పందించారు.  ఆ దిశగా కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



ప్రతి డిపార్ట్మెంట్ లో పెరిగిన రోగుల రద్దీకి అనుగుణంగా యూనిట్స్ పెంచాలని హెచ్ ఓ డిలు కోరారు.  ప్రతి ఆసుపత్రి లో పరిశుభ్రత కి పెద్దపీట వేయాలని ఆదేశించారు.  జూనియర్ డాక్టర్స్ కి ప్రతినెలా స్తైఫెండ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని మంత్రి ఆదేశించారు.   ఆసుపత్రిలో పని చేస్తున్న సఫాయి వారికి, సెక్యూరిటీ వారికి కూడా ప్రతినెలా జీతాలు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా  డాక్టర్స్  ప్రమోషన్స్ ఆలస్యం కాకుండా చూడాలని డి ఎం ఏ కి ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, నర్సులు, క్లీనింగ్ స్టాఫ్ అందరికీ ఏమీ కావాలో అవన్నీ చేస్తామని చెప్పారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నట్టు  మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: