మొలక గింజలు.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా.. అదేనండి ప్రస్తుత భాషలో చెప్పాలంటే స్ప్రౌట్స్.. ఈ మొలక గింజలు లేదా తృణ ధాన్యాల వల్ల అనేక లాభాలున్నాయి. అవేంటంటే.. శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఇందులో ఉండటం వల్ల వీటిని తరచూ తీసుకోవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవనే చెప్పాలి.. అయితే, ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. 


దానికోసం వారు ఎన్నో కష్టాలను కూడా ఎదురుకుంటారు. అధిక బరువు కారణంగా వారు, వారి భాగస్వాములతో సంసారం సుఖాన్ని అందుకోలే పోతుంటారు. ఇకపోతే తగ్గాలని చెప్పి కడుపు మడుచుకుంటారు. ఆలాంటి వారికోసం స్నాక్స్ తింటూ బరువు తగ్గించుకోవచ్చునని నిపుణులు అంటున్నారు అదెలాగో ఇప్పుడు చూద్దాము. మనకు చౌకగా, త్వరగా దొరికే వాటిలో శనగలు కూడా ఒకటి. ఇందులో ప్రోటీన్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన మన జీర్ణశక్తిని పెంచుతాయి. వీటిని తినడం వల్ల ఎవరికైనా త్వరగా ఆకలి వేయదు. కాబట్టి వీటిని మీ డైట్‌లో చేర్చుకోండి.


డ్రైఫ్రూట్స్ :

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ లాంటివి తింటే మీ ఆరోగ్యానికి మంచిజరగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారట. అంతేకాకుండా వీటిలో ఉండే గ్లూటెన్, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. అందుకే వీటిని నానబెట్టి కానీ, వేయించుకుని తింటే ఆరోగ్యకరమైన శరీరం మీ సొంతం అవుతుంది.


తామర గింజలు : 

తామరగింజలలో కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ లాంటివి ఎక్కువ మోతాదులో ఉండడం వలన ఇవి మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ అని చెప్పవొచ్చు. అదేవిధంగా వీటిలో కొలెస్ట్రాల్, సోడియం వంటివి అసలుండవు. అందుకే వీటిని కూడా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.


మొలకలు:

వీటిలో కేలరీలు తక్కువ ఉండటం వల్ల  వీటిని తీసుకోవడం చాలా ఉత్తమం. రోజు ఒక 50 – 100 గ్రాములు మొలకెత్తిన విత్తనాలు తింటే చాలట. అవి జీర్ణక్రియకు కూడా బాగా ఉపయోగపడే పీచు పదార్ధం కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఆ విత్తనాలలో కొద్దిగా ఖర్జూరం కలిపి తింటే చప్పగా కూడా అనిపించవు. ఇంకా చెప్పాలంటే వీటిని పరగడుపున తింటే మేలట.. 
ఇంకా పచ్చి బఠాణి లు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఎండు బఠాణీ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి బరువు తగ్గుతారు.
చూసారుగా బరువు తగ్గి, సంసారాన్ని సాఫీగా సాగించడానికి పైన తెలిపిన విదంగా వాటిని తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.. ఆలస్యం చేయకుండా తినేసెయ్యండి.. మీ బరువును తగ్గించుకోండి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: