చూడటానికి భయంకరంగా ఉండి, భైరవ దీపం సినిమాలో రాక్షసుడిలా ఉన్న ఈ పండ్లను బహుశా మీరు చూసే ఉండరు.. ఎందుకంటే ఈ పండ్లు మన దేశంలో దొరకవు కాబట్టి.. ఇకపోతే ఈ పండ్ల వల్ల ఎంతో ఆరోగ్యం ఉందంటున్నారు వైద్యులు. దొరకని వాటితో మనకేంటి అనుకోకండి. ఈ పండ్లకు సంబందించిన మందులు, రకరకాల ఆయిల్స్ మన మార్కెట్లలో దొరుకుకుతున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు వీటి పూర్వ పరాలేంటో ఓ పారి పరిశీలిద్దాం.. 


ఈ పండ్ల పేరు గర్వానా.. ఇవి దక్షణ అమెరికాలో చాలా తక్కువగా దొరుకుతుంటాయి. అక్కడి అమెజాన్ అడవుల్లో దొరుకుతాయట. అయితే, వీటి చెట్లు చూడటానికి తమలపాకు తీగలా ఉంటాయి. ఈ మొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పల్లినియా క్యూపానా. ఇకపోతే ఈ పండ్లు పండు లాగ మనకు దొరకవు ఇవి కేవలం మందుల రూపంలో మార్కెట్లలో దొరుకుతాయి. ఈ పండ్ల రుచి పుల్లగా, కాస్త వగరుగా ఉంటుందట. 



మరోవిషయమేంటంటే.. ఈ పండ్లను అక్కడి గిరిజనులు సంజీవని ఔషధంలా భావిస్తారట. జంతువులను వేటాడటానికి వెళ్ళినప్పుడు వీటిని ఎక్కువగా తీసుకుంటారట. చెప్పాలంటే మనకు గ్లూకోజ్ ఎలాగంటే వీళ్లకు ఈ పండ్లు అలాగ.  మనిషికి సాధారణంగా వచ్చే తలనొప్పి, ఫీవర్ లాంటివి ఈ పండ్లను తీసుకుంటే అవి దరికి చేరవట. ఇంకా కాలిన గాయాలను నయం చేయడంతో పాటూ..లైంగిక పటుత్వాన్ని పెంచే అద్భుతమైన ఔషధ గుణాలు ఈ పండ్లలో ఉన్నాయట.



ముఖ్య విషయమేంటంటే.. చాలా మంది పిల్లలు కలగ లేదని పడుతుంటారు. అలాంటి వారికోసం ఇది దేవుడు పంపిన దివ్యౌషదంలా పనిచేస్తుంది. స్పార్మ్ కౌంట్ పెంచేందుకూ ఉపయోగించే ట్యాబ్లేట్స్ లో ఈ పండ్లను ఉపయోగిస్తారట. మ్యూటన్స్, ఈకోలీ, సాల్మొనెల్లా వంటి ప్రాణాంతకమైన బ్యాక్టీరియా ను నాశనం చేయడంలోనూ ఈ పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తారట. బోన్స్ గట్టిగా ఉండాలంటే ఈ పండ్లను తినాలంట. 



ఇకపోతే జీర్ణవ్యవస్థలో కలిగే అనేక రకాల సమస్యలు, మతిమరుపు, మెమరీ లాస్ వంటివి నయం చేయడానికి కూడా ఈ గ్వారాన పండ్లను ఉంపయోగిస్తారట. ఇవి మార్కెట్లలో అంతగా దొరకక పోయినా కూడా వీటి నుండి తయారు చేసిన మందులకు మంచి డిమాండ్ ఉందంటున్నారు నిపుణులు. మీరెప్పుడైనా కూడా అమెజాన్ అడవుల వైపు వెళితే మాత్రమే వీటిని తినడం మర్చిపోకండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: