మనశరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిని  ఏ పేరుతో వ్యవహరించినా శరీరంలో జీవక్రియలన్నింటికీ అతి ముఖ్యమైన అవయవాలివి.శరీరంలో నిరంతరం రక్తాన్ని వడబోయడమే వీటిపని.ఈ మూత్రపిండాల పనితీరు మందగిస్తే ఆ వ్యక్తి రకరకాల ఆరోగ్య సమస్యలకు గురై, ఇక చావుకు చేరువకాక తప్పదు.గత కొన్ని దశాబ్దాలుగా కిడ్నీలవ్యాధులు తీవ్రంగా మారాయి.ఈ వ్యాధుల్ని ముందుగా గుర్తించ లేకపోవడం,గుర్తించిన తర్వాత వైద్యం అందుబాటులో లేకపోవడం,దూరప్రాంతాల్లో ఖరీదైన వైద్యాన్ని చేయుంచుకోలేక ఎన్నో జీవితాల్లో చీకట్లు అలముకుంటున్నాయి.కిడ్నీవ్యాధికి గురైతే ఇక చావుని సమీపించినట్టే అనే భావన జనంలో బలంగా ఏర్పడిపోయింది.ఇక కిడ్నీలు పాడైతే మాత్రం ముందుగానే మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.



1. మూత్రం ఎప్పుడూ రంగుమారి వస్తుంటే కిడ్నీల సమస్య ఉన్నట్లు గుర్తించాలి. సాధారణ రంగులో కాకుండా మూత్రం రంగు మారి వస్తుంటే కిడ్నీచెకప్ చేయించుకోవాలి. వైద్యులసలహా మేరకు చికిత్సతీసుకోవాలి.
2. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వ్యర్థాలు రక్తంలోనే ఉంటాయి.దీంతో నోట్లో దుర్వాసన వస్తుంది.అలాగే ఆకలికూడా బాగా తగ్గుతుంది.
3. తరచూ వికారం,వాంతుల సమస్య ఉన్నా కిడ్నీ సమస్యేమోనని అనుమానించాలి.వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులనువాడడమో, 


4. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థ ద్రవాలు అలాగే ఉంటాయి.దీంతో ఆ ద్రవం పలుభాగాల్లోకి చేరి శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది.ముఖ్యంగా కిడ్నీలుపాడైతే కాళ్లు, చేతులు బాగా వాపునకు లోనవుతాయి.అవి ఉబ్బిపోయి కనిపిస్తాయి.ఈ సమస్య ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
5. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఆ ప్రభావం వల్ల శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనత వస్తుంది.దీంతో తీవ్రమైన అలసట ఉంటుంది.ఈ సమస్య ఉన్నా స్పందించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
6. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే చర్మంపై దద్దుర్లు కూడా వస్తుంటాయి.అలాగే కిడ్నీలు ఉండే వీపు ప్రాంతంలో పొడిచినట్లు నొప్పివస్తుంది.



7. కిడ్నీసమస్య ఉంటే శ్వాసతీసుకునే ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడుతాయి.జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత ఉండదు. వాతావరణం ఎలా ఉన్నా సరే చల్లనిఫీలింగ్ కలుగుతుంది. 
8. కిడ్నీసమస్య ఉంటే  నీరసంగా ఉండి,బరువు తగ్గిపోతుంటారు.కొద్దిగా పనిచేయగానే అలసిపోవడం,ఆయాసం వస్తుంటుంది.

ఈ లక్షణాలు గనక ఎవరిలోనైనా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకుంటే కిడ్నీలు మరింత పాడవకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.లేదంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: