సాధారణంగా మన ఇంట్లో ఏదైనా స్పెషల్ గా చేసిన వంట ఏదైనా ఉంటె దానిని మనం తిన్నంతవరకు తిని మిగిలిన ఆహారం మనం ఫ్రిజ్లో పెడుతాము. అదే ఆహారాన్ని మళ్లీ మరుసటి రోజు తింటాము. కాలానుగుణంగా మనలో బద్ధకం కూడా బాగా పెరగడంతో వేడిగా చేసుకోవడం మళ్లీ అదొక టైం వెస్ట్ అని చాలా మంది ఆ ఆహారాన్ని తినేస్తుంటారు. అలా చేయడం వాళ్ళ కొత్త రోగాలు కూడా తలెత్తుతుంటాయి. 




టెక్నాలజీ పెరిగింది అనుకోని ఆనందపడాలో లేక వాటివల్ల కలిగే బాధలతోచాలా మంది బాధపడుతన్నారు. మనుషులు కూడా అలానే తయారవుతున్నారు. ఈజీ గా ఉన్న పద్ధతి నే చాలా మంది ఎంచుకుంటున్నారు. అందుకే ఒక రోజు చేసు చేసిన ఆహారాన్ని వారం అంతా తినడానికి మక్కువ చూపిస్తారు.ఒకవేళ చల్లగా ఉంటె చిటికెలోవేడిచేసుకొనేలా మైక్రో ఒవేన్ లో వేసి వేడి చేసుకొని తినేస్తున్నారు. అలా 99 % మంది చేసే పనే ఇది. 




ఒకవేళా అలా ఒవేన్ లో పెట్టుకున్న కూడా మరోసారి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని తింటే మంచిదంటున్నారు నిపుణులు. ఉదయం చేసుకున్న వంటను రాత్రిలోపు తినటం చాల మంచిది అట. ఫ్రిజ్ లో ఆహారాన్ని ఉంచటం మానేసి ఏరోజు వంట ఆరోజు తింటే ఆరోగ్యానికి చాల మంచిది అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.





ఎప్పుడో ఒక్కసారి చేసుకోవడం సరేగాని, తరచూ అలాగే చేస్తే మన ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. మనం ఎంత చేసిన కూడా మనం అంటూ  ఉండాలంటే కొంచం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకే ఇప్పటికైనా రోజు మనం చేస్తున్న తప్పులను సరిచేసుకొని పైన చెప్పిన విధంగా ఫాలో అయితే మీరు మీ కుటుంబం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. బద్దకాన్ని వదలండి  మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడాండుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: