ఖర్జూరం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో ఎందుకంటే చూడగానే నోటిలో వేసుకోవాలనిపించే ఈ పండ్లను. వయసుతో పనిలేకుండా అందరి తింటారు. ఇకపోతే కేవలం ఈ ఖర్జూరాలను అలానే తినడం కాకుండా తేనే తో కలిపి తీసుకుంటే చాలా లాభాలుంటాయి అంటున్నారు నిపుణులు మరి అవేంటో ఇప్పుడు చూద్దాము. 




తేనే కూడా అంతేనండి .. ఆరోగ్యం, అందానికి ఈ తేనే బాగా ఉపయోగ పడుతుంది. అంతేకాదండోయి.. శరీరంలో పేరుకు పోయిన అధిక కొవ్వును కరిగించడంలో తేనే మంచి మెడిసిన్ అనే చెప్పాలి. ఇకపోతే తేనెతో పాటుగా ఈ ఖర్జూరాలను కలిపి తింటే.. వింటుంటూనే నోరు ఊరూతుంది కాదా.. అంతే ఆరోగ్యం కూడా ఉందంటున్నారు. ఎటువంటి ఆరోగ్యం ఉందొ ఇప్పుడు చూదాం.. 


ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేస్తారంటే.. 

ఒక డబ్బాను తీసుకొని, అందులో సగానికి పైగా తేనే ను నింపాలి. ఖర్జూర పండ్లను తీసుకొని వాటిలో ఉండే గింజలను తొలగించాలి. ఆ ఖర్జూరాలను ఆ తేనే లో ముంగే వరకు వేయాలి.. అలా నానా బెట్టినవి రోజు తినడం వాళ్ళ చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో చుడండి. 



వీటిని తినడం వలన ముందు మీకు దగ్గు, జలుబు లాంటివేమైనా ఉంటె వాటినుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
వాటిని తినడం వలన మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యతో భాధపడేవారు ఈ మిశ్రమాన్ని తరచు తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందొచ్చు.
మీరు ఒత్తిడి నుండి దూరం అవ్వాలంటే కూడా ఈ తేనె , ఖర్జురాపండ్ల మిశ్రమాన్ని తరచు తినండి.
మీ శరీరంపై ఏమైనా గాయాలుంటే..ఈ మిశ్రమంలో ఉండే యాంటీ బయాటిక్ గుణాల వల్ల అవి త్వరగా మానతాయి.
ఇవి తినడం వలన మీ పిల్లలకు మెమొరీ పవర్ పెరుగుతుంది. ఆపై వారు చదువుల్లో, ఆటల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.
ముఖ్యంగా తేనె, ఖర్జూర మిశ్రమంలో కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. కాబట్టి ఈ మిశ్రమాన్ని తరచు తింటే మీ శరీరంలో రక్త హీనతను తగ్గించుకోవచ్చు. దానితో పాటు మీ ఎముకలు బలంగా మారతాయి.
మీరు చెక్కర వ్యాధితో బాధపడుతున్నా కూడా ఈ తేనె , ఖర్జురా పండ్లను తినడం ద్వారా దానిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇంకా మలబద్ధకంతో బాధపడే వారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది.
మనం తినే ఆహరం ద్వారా వెళ్లే కొన్ని సూక్ష్మ జీవులు కడుపులోని పేగుల్లో చేరి మనల్ని భాధిస్తు ఉంటాయి. వాటిని నాశనం చేసే శక్తీ ఈ తేనె, ఖర్జురం మిశ్రమంలో ఉంటుంది. అంతే కాకుండా మనకు తరచు వచ్చే గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం కూడా పొందవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: