మానవుని శరీరానికి అన్ని రకాల పోషకాలు అందితేనే పూర్తిగా ఆరోగ్యంగా జీవిస్తాడు.అందులో ఏ ఒక్కటి తక్కువైనా,ఎక్కువైనా దేహంలో పలురకాల మార్పులు చోటు చేసుకుంటాయి.ఇలా ప్రతి మిటమిన్ ఈ దేహమనే యంత్రానికి కావలసిందే.మనకు కావలసిన మిటమిన్స్‌లో బి6 మిటమిన్ ఒకటి.దీన్నే పైరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు.ఇది నీటిలో కరిగే విటమిన్.మనశరీరం లో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.



ముఖ్యంగా ప్రోటీన్లు,ఫ్యాట్స్,కార్బొహైడ్రేట్ల మెటబాలిజంకు,ఎర్రరక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి6 ఎంతో అవసరం ఉంటుంది. అయితే ఈ విటమిన్‌ను మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు.కనుక ఆహార పదార్థాల ద్వారానే మనం దీన్ని అందివ్వ వలసిన అవసరం ఉంది.ఇక విటమిన్ బి6 మనకు ఎక్కువగా చేపలు,పిస్తాపప్పు,అరటిపండ్లు, చికెన్,మటన్ లివర్,పాలకూర వంటి తదితర ఆహారపదార్ధాల్లో లభిస్తుంది.వీటిని తరచూగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి6 లోపం రాకుండా చూసుకో వచ్చు.అలాగే గుండె జబ్బులు,క్యాన్సర్, కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.



ఇక విటమిన్ బి6 మనకు తగినంతగా లభించకపోతే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.వాటిలో చర్మంపై దద్దుర్లు,పెదవులు పగలడం,నోటి పూత వస్తుంది.రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగించడమే కాకుండా.డిప్రెషన్‌తో ఉంటారు.నిస్సత్తువగా, అలసిపోయినట్లుగా ఫీలవుతారు.చేతులు,పాదాల్లో గుండు పిన్నులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి ఫిట్స్ కూడా వస్తాయి. అయితే విటమిన్ బి6 ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే పైన చెప్పిన అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా చూసుకో వచ్చు..అందుకే ప్రతివారు తీసుకునే ఆహారంలో అన్ని మిటమిన్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకుంటే మంచిదంటారు, వైద్యనిపుణులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: