టైం మిషిన్ కంటే వేగంగా పరిగెత్తే మనిషి జీవితంలో తినడానికి కూడ టైం సరిపోవడం లేదు.ఉదయం లేచిన దగ్గరినుండి రాత్రి పడుకోబోయే సమయం వరకు హడావుడితోనే సరిపోతుంది.ఏం తింటున్నాడో ఏమో అతనికే తెలుసు.ఈ ఉరుకుల పరుగుల జనరేషన్ లో మార్నింగ్ టైంలో కనీసం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కూడా సమయం దొరకదు.అలాగని ఆరోగ్యాన్ని పట్టించు కోకుండా ఉంటే అనారోగ్యం పాలవుతారు..కనీసం ఓ కప్పు పాలనైన,బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం కూడా చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.



ఎందుకంటే పాలు తాగడంవల్ల కాల్షియం శరీరానికి అందుతుంది,నీరసంగాఉన్న సమయంలో అధికపోషకాలతో శక్తిని ఇస్తుంది. ఎముకలు ధృడంగా ఉంటాయి.దంతాలు జీవితకాలం గట్టిగాఉంటాయి.ఇక రోజు పాలు తాగడంతో మతిమరుపుకు చెక్ పెట్టొచ్చు. పాలు తాగేవారి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరిగి..మెదడు కణాలకు రక్షణ కల్పించడంలో తోడ్పడుతుంది.పాలలో ఉండే గ్లుటాథయోన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.నరాలు బలహీనపడటాన్ని తగ్గించడంలో పాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని  నిపుణులు చెబుతున్నారు..



ఇక మనలో చాలా మంది ఎక్కువగా రాత్రి భోజనం చేశాక పాలు తాగుతుంటారు..అలాగే బ్రేక్ ఫాస్ట్ సమయంలోనూ పాలు తాగడం చాలా మంచిదని సూచిస్తున్నారు.ఇప్పటికి కొంతమందికి పాలు ఏ సమయంలో తాగాలో తెలియక అయోమయంలో ఉన్నారని తమ అనుభవంలో తేలిందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ క్రమంలోనే పాలు ఉదయం పూట ఎలాంటి ఆహారం తీసుకోకముందు తాగినా మంచిదే,బ్రేక్ ఫాస్ట్ కు ముందు పాలు తీసుకుంటే ఆ రోజు ఎంతో ఎనర్జిగా ఉంటారు.చురుకుగా పని చేస్తారు.కాబట్టి పాలు తాగాక కాసేపటికి బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగ్గా చేయండి.కేవలం పాలతోనే సరిపెట్టుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.మరింకేంటి ఈ రోజునుండే ఓ కప్పు పాలను తప్పనిసరిగ్గా తీసుకోవడం మరవకండి..


మరింత సమాచారం తెలుసుకోండి: