గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ గురించి ఎంత మాట్లాడుకొన్న తక్కువ ఎందుకంటే గ్రీన్ టీలో అమేజ్ బ్యూటీ, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవిషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఈ మద్య కాలంలో గ్రీన్ టీ చాలా పాపులర్ అయింది. గ్రీన్ టీ అంటే .... ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ పెరుగుదలను నిరోధిస్తుంది.


శరీరంలోని కొలెస్టరాల్‌ను కరిగించడంలో గ్రీన్‌టీ చక్కగా తోడ్పడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం జరుగుతుంది. వయసు పెరుగుదల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావాన్ని గ్రీన్‌టీ తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. అయితే గ్రీన్ టీని నిత్యం సేవించే వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ రావని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.


అంతే కాదు.. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మనలోని రోగ నిరోదక శక్తిని పెంచి, రక రకాల రోగములు, క్రిముల నుండి మనల్ని రక్షించడమే కాకుండా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: