జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అందరికి తెలిసిందే. ఈ జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో అలానే వంటకాలకు రుచిని, సువాసనని ఇస్తుంది. అయితే రోజు ఉదయాన్నే కాచిన గోరువెచ్చని నీటిలో ఈ జీలకర్రని కలిపి పరగడుపునే తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే రోజు తాగకపోయిన కనీసం వారానికి ఒకసారి తగిన మంచిది అని అంటున్నారు. మరి ఏం ఏం మంచిదో మీరే చూడండి. 


జీల‌క‌ర్ర నీరు తాగితే మూత్రం ధారాళంగా వ‌స్తుంది. కిడ్నీరాళ్లు క‌రుగుతాయి. కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు వదిలి పోతాయి.


జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారికి ఈ నీరు మంచి ఔషధం.


మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


జీల‌క‌ర్ర నీటిని తాగితే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.


జీల‌క‌ర్ర నీటిని తాగితే జీర్ణాశ‌యం శుభ్ర‌పడి మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి, క‌డుపులో వికారం, క‌డుపులోని అల్సర్లు వదిలిపోతాయి.  


జీల‌క‌ర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో రక్తస‌ర‌ఫ‌రా మెరుగు ప‌డటమే గాక రక్త నాళాల్లోని అడ్డంకులు తొల‌గి గుండె స‌మ‌స్య‌లు రావు.


జీలకర్రలోని స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్ గుణాలు రోగనిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తాయి. దీనివల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి అనారోగ్యాలు దరిజేరవు. చూశారుగా జీలకర్ర నీటిని తాగితే ఎంత ప్రయోజనమే. కాబట్టి అప్పుడప్పుడైనా జీలకర్ర నీటిని తాగి ఆరోగ్యవంతులు అవ్వండి.


మరింత సమాచారం తెలుసుకోండి: