అవును షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తే.. ఎందుకంటే.. షుగర్ వ్యాధి తగ్గించుకునేందుకు ఓ మార్గం గురించి ఓ పరిశోధన ఆసక్తికరమైన వార్త తెలిపింది. అదేంటంటే.. టైప్-2 డయాబెటిస్ వ్యాధి నిర్ధరణ తర్వాత తొలి ఐదేళ్లలో 10శాతం శరీర బరువు తగ్గితే వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశాలున్నాయట.


కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయం కనిపెట్టారు. 40 నుంచి 69 ఏళ్ల వయస్సు ఉన్నవారిపై వీరు పరిశోధన చేశారు. కొత్తగా డయాబెటిస్ బారిన పడ్డ 867 మందిపై పరిశోధన సాగించారు. వారిలో తొలి ఐదేళ్లలో శరీర బరువును 10 శాతం తగ్గించుకున్న 257 మందికి వ్యాధి పూర్తిగా నయమైనట్టు గుర్తించారు.


జీవనశైలి మార్పులు, సరైన వైద్యంతో.. టైప్-2 డయాబెటిస్ బారి నుంచి బయటపడొచ్చని జర్నల్ డయాబెటిక్ మెడిసిన్ లో ప్రచురితమైన నివేదిక తెలిపింది. ఎనిమిది వారాలు రోజుకు 700 కెలోరీలు తీసుకునే సగటున 10 మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో తొమ్మిది మందికి వ్యాధి నయమయ్యే అవకాశాలున్నట్లు తేలిందట.


ప్రపంచవ్యాప్తంగా 40కోట్లమంది ప్రస్తుతం ఈ మధుమేహవ్యాధితో బాధపడుతున్నారు. వారిలో షుగర్ వ్యాధి వచ్చిన తొలి ఐదేళ్లలో బరువు తగ్గితే.. వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: