పొద్దున లేచిన దగ్గరి నుండి పని ఒత్తిడి,ఇంకా రకరకాలైన టెన్షన్స్,వీటన్నీటికి దూరంగా వుండి కాస్త రిలాక్స్ అవ్వాలంటే కావలసింది టీ...ఈ టీ ఉదయమైనా.సాయంకాలమైనా,చక్కటి,చిక్కటి..టీ గొంతులో పడకపోతే..ఏ కాలమైనా చాలామందికి పొద్దు పోదు..వానాకాలమైతే ఈ ట్రీట్ తప్పక ఉండాల్సిందే!



తేనీటి విందును పసందుగా.కబుర్లాడుకుంటూ లాగించేవారు ఎందరో కనిపిస్తుంటారు.ఇక రిలాక్స్ అవ్వనికి తాగే టీ తో అనారోగ్యాలు వస్తాయని తెలిస్తే ఎవరైన తాగుతారా అంటే,అయినా తాగే వాళ్లు వున్నారు.ఇక మనం నిత్యం పేపర్ ప్లేట్‌లు, కప్‌లు ఎక్కువగా వినియోగిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట.ఎలాగంటే వీటిలోనూ కొంత శాతం ప్లాస్టిక్ కలుస్తుందట.



ఈ ప్లాస్టిక్ కణాలు కడుపులో చేరడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత,దృష్టి లోపాలు,అలసట,చర్మ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కప్పుల్లో ఉండే బ్యాక్టీరియా పొట్టలో చేరి లేనిపోని సమస్యలను తీసుకొస్తుందని వారు చెప్తున్నారు.ఇంకా కప్పులకు పూసే వాక్స్ ద్వారా వేడివేడి చాయ్ అందులో పోయడంతో ఆ వాక్స్ కరిగి కడుపులోకి చేరుతుందట..దీనివల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు..



అంతే కాకుండా కప్పులకు పూసే వాక్స్‌వల్ల చిన్నపేగుల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని,జీర్ణ ప్రక్రియ వ్యవస్థను దెబ్బ తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వీలైనంత వరకు స్టీల్,గాజు గ్లాసులు వాడడమే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. ఇక థర్మాకోల్ కప్పులు కూడా అసలే వాడకూడదు.అవి పాలిస్టర్ అనే పదార్థంతో తయారు చేస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. ఆ పాలిస్టర్ కూడా ఒక రకమైన ప్లాస్టిక్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఎక్కువగా ఈ రకమైన కప్పులు వాడే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం మెండుగా ఉంటుందట...


మరింత సమాచారం తెలుసుకోండి: