లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసే అయినా.. వీటిలో అనేక ర‌కాల  పోషకాలు ఉన్నాయి. లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇక లవంగాలు మన వంటింట్లో ఉండే ముఖ్యమైన మసాలా దినుసుల్లో ప్రధానమైనవి. నాన్‌వెజ్ వంటలు వండినప్పుడు ఎక్కువగా లవంగాలు వేస్తారు. అయితే రోగాలను నయం చేస్తుంది లవంగాల టీ. అధిక పోషక గుణాలున్న లవంగాలతో చేసిన టీ రుచిగా, ఘాటుగా కూడా ఉంటుంది.


ఈ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సమ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి పోతాయి. రోజూ లవంగాల టీ తాగుతుంటే కీళ్ల నొప్పులు పోతాయి. కాళ్ల వాపులు, కండరాల నొప్పులు తగ్గిపోతాయి. లవంగాల టీని కొద్దిగా అరచేతులకు రాసుకుంటే చేతుల్లో దాగున్న క్రిములు చనిపోతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండే ఈ టీ చేతులను శుభ్రంచేస్తుంది.


మధుమేహం ఉన్నవారికి ఈ టీ చాలా మంచిది. ల‌వంగాల టీ తాగ‌డం వ‌ల్ల‌ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.  శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు రావు. జ్వరం, దగ్గు, జలుబు బాధించవు. లవంగాల టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోబాటు క్యాన్సర్‌,  గుండె స‌మ‌స్య‌ల‌ను  దూరం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: