సాధార‌ణంగా ప‌చ్చి బ‌ఠానీ తెలియ‌ని వారుండ‌రు. ఇవి ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ మరియు ఎండబెట్టి కూడా వాడుతారు. పచ్చి బఠానీలను కూరల వినియోగంలోనూ మరియు ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు.  ప్రధానంగా చలికాలంలో ఇవి మార్కెట్‌లో అధికంగా లభిస్తాయి. అలాగే వెజ్ బిర్యానీ, ఆలూ కూర్మా, పన్నీర్ మసాలా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వంటకాల్లో మనం పచ్చి బఠానీలను ఎక్కువగా వాడుతుంటాం. అయితే వీటి వ‌ల్ల పోష‌కాలు అధికం..


ముఖ్యంగా ప‌చ్చి బ‌ఠానీల‌ను టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు తీసుకుంటే ఎంతో మంచిది. ఇవి చాలా త‌క్కువ క్యాల‌రీల‌ను ఇస్తాయి. అందువ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌నే భ‌యం ఉండ‌దు. అలాగే ప‌చ్చి బ‌ఠానీల్లో ఉండే పొటాషియం షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుతుంది. హైబీపీ రాకుండా చూస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్నందున శ‌రీరానికి పోష‌ణ అందుతుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం పచ్చి బ‌ఠానీల‌ను త‌మ ఆహారంలో భాగం చేసుకుంటే షుగ‌ర్‌ను చాలా సుల‌భంగా నియంత్ర‌ణ‌లో ఉంచ‌వ‌చ్చు.


అదే విధంగా పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే చాలా మంచిది. మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు ప‌చ్చి బ‌ఠానీల్లో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: