చాలా మందిలో తరచూ కనిపించే సమస్య నిద్రలేమి.. ఈ సమస్య ఉండటం వల్ల నిద్రలేకపోవడంతో నానా రకాల ఆరోగ్య సమస్యలతో భాధపడుతుంటారు.  మనం ఎంత పనిచేసిన కూడా కంటికి, మెదడుకి కాస్తంత విశ్రాంతి ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు రోజుకు కొద్దీ గంటలు నిద్రపోవడమో లేక పగలు నిద్రపోవడమో చేస్తుంటారు. మనిషి సగటు 6 నుండి 8 గంటలు పోతే ఆరోగ్యాంగా ఉంటారని అందరు అంటున్నారు. అలా లేని పక్షంలో మనిషకి లేనిపోని సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. 


ప్రతి ఒక్కరు చెప్పే మాట నిద్ర రావటం లేదు. నిద్ర పట్టడం లేదు దీనినే నిద్రలేమి సమస్యతో భాదపడుతుండటం అని అంటారు. ఈ సమస్యను గుర్తించిన వెంటనే దీనికి పరిష్కారం వెతుక్కోవాలి లేదంటే దీని మూలాన మన శరీరానికి ఇతర సమస్యలు చాలా వస్తాయి. ఇక్కడ మేము చెప్పే ఈ చిట్కాలను పాటించటం ద్వారా చాల వరకు నిద్ర లేమి సమస్యను దూరం చేయచ్చు.


బద్దకాన్ని అలవాటు పడ్డ మనం వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలనీ అందరు అంటున్నారు. ఫిట్ నెస్ కోసం మరియు అధిక బరువును తగ్గించటం కోసమే కాదు ..రోజు 20 నిముషాలు వ్యాయాయం చేయటం ద్వారా నిద్ర లేమి సమస్యను అరికట్టచ్చు అని పరిశోదనలు చెప్తున్నాయి. రాత్రివేళ పడుకొనే ప్రదేశాల్లో అంతా చీకటిగా ఉండేలా చేసుకోవడం మంచిది అంటున్నారు. 


మనం నిద్రకు ఉపయోగించే మంచాన్ని నిద్రకు మాత్రమే వాడాలి..చాలా మంది అలా కాకుండా దానిమీదే కూర్చొని తినటం అక్కడే తమ పనులను చేసుకోవటం చేస్తూ వుంటారు…ఇలా చేసినా కూడా మనకు నిద్ర లేమి సమస్య వస్తుంది. ఒకవేళ మధ్యలో మెలుకువ వస్తే ఫోన్ కానీ, టీవీ కానీ చూడటం వాళ్ళ నిద్ర మొత్తం పోతుందని అంటున్నారు. వీలైతే ధ్యానం చేయాలనీ నిపుణులు వెల్లడిస్తున్నారు. చూసారుగా నిద్రలేక పోవడం వాళ్ళ ఎన్ని సమస్యలు వస్తున్నాయో.. ఇకనైనా అన్ని పక్కన పెట్టి నిద్రపోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: