మాములుగా పండ్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటారు.. అలాంటి పండ్లలో రోజులో మన శరీరానికి కావలసిన ఎన్ని రకాలా ఓషదాలున్నాయని అంటున్నారు. పెరుగుతున్న ఆహారపదార్థాలను బట్టి మనం తినే ఫుడ్ ఎక్కువగా కలుషితమవుతుంది. అలాంటిది రోజుకు పండ్లను తీసుకోవడం మేలట.. ఏ పండ్లను ఎక్కువగా తింటే మనకు ఉపయోగ పడుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం.. 


ప్రతి ఒక్కరికి వున్న సమస్య అధిక బరువు. రోజు మనం తినే ఆహారంలోని మార్పుల వల్ల ఈ సమస్య పెరిగిపోతోంది అని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు.ఇంట్లో దొరికే వాటితో బరువు తగ్గించుకోవడం మంచిది. జంక్ ఫుడ్స్ కు ఎంత ఎక్కువగా దూరంగా ఉంటె మనకు అంతమేలు. ఈ మూడు ఫ్రూట్స్ ద్వారా కూడా మీరు బరువును తగ్గించుకోవచ్చు.


ఆపిల్:

రోజు ఒక ఆపిల్ తినటం వల్ల వైద్యుడు అవసరం లేదంట..అలాగే ఈ ఆపిల్స్ బరువు తగ్గించటం లో కూడా బాగా ఉపయోగ పడతాయి అంట. రోజు 3 – 4 ఆపిల్స్ తినటం వల్ల బరువు త్వరగా తగ్గుతారట.

ఆరెంజ్ :

మనకు బాగా తెలిసిన పండు ఆరెంజ్..ఇందులో ఫైబర్ మరియు నీటి శాతం ఎక్కువ కాబట్టి ఇవి 2 తిన్నవెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. అంతే కాక ఆరెంజ్ వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు లభిస్తాయి. నారింజ వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు.

పుచ్చకాయ:

పుచ్చకాయ వేసవి కాలం లో బాగా దొరుకుతుంది దీనిలో నీటి శాతం చాలా అధికం ఇంకా క్యాలరీలు కూడా చాలా తక్కువ కాబట్టి మీ వెయిట్ లాస్ గోల్ ను ఈ ఫ్రూట్ తో సులభంగా సాధించవచ్చు.ఇలా మీకు దగ్గరలో దొరికే పండ్లను మీ డైట్ లో ఉపయోగించుకుంటే…మీకు వెయిట్ లాస్ అవ్వటం పెద్ద కష్టం ఏం కాదు.
ఇకపోతే మీరు రోజు తినే ఫుడ్ తో కాకుండా, మితంగా తినే ఆహారాన్ని తగ్గించడానికి వీటిని తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు నిపుణులు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: