హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు.  ఇది అత్యంత ఆరోగ్యకరమైన, పవిత్ర మరియు అద్భుతమైన ఔషధ ఆయుర్వేద మూలిక. తులసి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తులసిని సర్వరోగ నివారిణి అంటారు. రుతువులు, కాలాలు మారే రోజుల్లో పలు రకాల వ్యాధులు ప్రబలుతాయి. వాటిని నివారించ‌డానికి తుల‌సి గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.


ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి.కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.  తులసి ఆకులు మీ జుట్టు సుదీర్ఘంగా మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. 


ప్రధానంగా తులసి జ్వరహారిణి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. తులసి ఆకులు ముఖంపై బ్లాక్హెడ్లను నివార‌ణ‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. క్రమంగా తాజా తులసి ఆకులు అలవాటు మీ రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. తులసిలో వివిధ రసాయన సమ్మేళనాలు 20 శాతం వరకు శరీరంలోని ఇన్ఫెక్షన్-పోరాట ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: