ప్ర‌స్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకునే అల్ఫాహారం విషయంలో ఆశ్రద్దను కనపరుస్తున్నారు. అయితే ఉద‌యాన్నేమనం తీసుకునే అల్ఫాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమత్యుల పరిచి ,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ చాలా మంది ఉద‌యం టిఫిన్ తినే స‌మ‌యం లేక ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకుంటూ ఉంటారు. అన్ని సీజ‌న్ల‌లోనూ దొరికే అర‌టిపండ్లు మంచివే అయినా ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో తిన‌డం అంత మంచిది కాదు.


అరటిపండులో పోటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండును తినడం వలన ఇది శరీరంలోని మినరల్స్ స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో తినడం వలన కడుపులో అమ్లత్వమునకు దారి తీసి పేగు సమస్యను తీవ్ర తరం చేసే అవకాశం ఉంది. అందుకే ఉద‌యాన్నే అర‌టిపండు తినకూడ‌దు. కానీ అర‌టిపండు ఖాళీ క‌డుపుతో కాకుండా ఎప్పుడు తిన్నా మంచిదే.


తరచు అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి చేరే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి శరీరానికి క్యాన్సర్ సోకకుండా నిరోధిస్తుందట. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా వుండేందుకు కూడా అరటి పండు మేలు చేస్తుంది. అరటిపండులో వుండే ప్రొబయోటిక్ అనే బ్యాక్టీరియా ఒంట్లోని క్యాల్షియంని తీసుకుని ఎముకలని పటిష్టపర్చేందుకు సహకరిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: