చాలామందికి కాఫీ తాగడం అనేది ఒక  అలవాటుగా ఉంటుంది కదా... కాఫీ తాగటం వల్ల అనవసరపు కొవ్వుపై కొంత ప్రభావం చూపిస్తుంది. అందుకే కొంత మంది రన్నర్‌లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువుగా కాఫీని తాగుతూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువుగా కాఫీ తాగటం వలన గుండె కొట్టుకునే వేగం బాగా పెరుగుతుంది. దీనివల్ల గుండె స్పందనల్లో, లయలో తేడాలువచ్చే అవకాలు ఉన్నాయి. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు కూడా అలసటకు గురి అవుతుంది.


 కాఫీ తాగడం వల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిచేవారు కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. కాఫీ కన్నా టీ తాగటం కొంచం వరుకు చాల మంచిదని చెప్పాలి. టీలో థయనిన్ అనే అమైనోయాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్) ఉండటం వల్ల అది చక్కటి రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. అయితే చక్కెర, పాల శాతాన్ని తగ్గిస్తే చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు. తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే, అప్పుడు కాఫీని దానిని రోజుకు 2 నుంచి 3 చిన్న కప్పులు మాత్రమే తీసుకోవాలి అని తెలియచేస్తున్నారు ప్రముఖ నిపుణులు.


కాఫీ వల్ల చాల ప్రయోజనాలు  కూడా చల్ ఉన్నాయి.  సాధారణంగా ఇంటి శుభ్రతలో కొన్ని ఇంట్లోని వస్తువులను ఉపయోగించి క్లీన్ చేస్తుంటాం. ఉదాహరణకు నిమ్మ, పంచదార, వెనిగర్ మరియు బేకింగ్ సోడా. ఈ వస్తువులను వంటలకు మాత్రమే కాదు, ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు క్లీనింగ్. ఇంకా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనందరికీ కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం అంతే కాదు కాఫీ బీన్స్ సువానంటే..ప్రతి ఒక్కరినీ టెమ్ట్ చేసేస్తుంది. ! కానీ, కాఫీ వల్ల మరికొన్ని ఇతర ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా?


నిమ్మకాయ, బేకింగ్ సోడా, పంచదార, వలే కాఫీ కూడా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అవును, కాఫీ బీన్స్ లేదా పౌడర్ బీన్స్ ను వివిధ అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కాఫీ వల్ల చాలా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు. చర్మాన్ని ఎక్స్ ఫ్లోయిట్ చేయడానికి కాఫీని ఎక్కువగా ఉపయోగిస్తారు. కారును శుభ్రం చేయడానికి మరియు రూమ్ లో వచ్చే వాసనలు దూరం చేయడానికి కాఫీ బాగా సహాయపడుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: