సాధార‌ణంగా గసగసాలను వంటల్లో తరచుగా వాడుతుంటారు. ఎక్కువగా మసాలాల్లో భాగంగా ఉండే గసగసాలు ఆరోగ్యానికి మేలుచేస్తాయి. తెల్లగా, చిన్నగా ఉండే గసగసాల్ని ఈ రోజుల్లో మనం వంటల్లో వాడుతున్నాంగానీ... పూర్వం వాటిని మందుల తయారీలో వాడేవాళ్లు. ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రకరకాల వ్యాధులకు నివారిణిలా ఇది పనిచేస్తాయి. కూరకు రుచిని ఇచ్చినట్టుగానే మనిషి శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.


గసగసాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేయడానికి తోడ్పడతాయి. దీనిలో ఉంటే ఆక్సలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. అలాగే శ్వాస సమస్యలకు చెక్ పెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గసగసాలు ఎక్స్పెక్టోరెంట్, సిమల్సేంట్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి తగ్గుతాయి. కడుపులో మంట, ఎసిడిటీ వున్న వారు గసగసాల్ని వాడితే పేగులలో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.


చుండ్రు తగ్గడానికి, వెంట్రుకలు పెరగడానికి గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి, తలకు పెట్టుకుని ఆరిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తుంటే తలలో కురుపులు, చుండ్రు తగ్గి పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుండె సమస్య ఉన్నవారు గసగసాలను తీసుకొంటే గుండె హాయిగా ఉంటుంది. గసగసాలు కొంచెం నీళ్ళతో నూరి, తగినంత పటిక బెల్లం కలిపి రోజు తింటే ఉష్ణ శరీరం కలవారికి అధిక వేడి తగ్గి, శరీరానికి చలువ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: