గత కొంత కాలంగా బంగారు తెలంగాణ దిశగా అడుగులేయాల్సిన తెలంగాణ రాష్ట్రం అడుగడుగునా వివాదాస్పదంగా తయారైంది. జటిలమైన సమస్యలతో మల్లగుల్లాలు పడుతున్న తెలంగాణ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సతమతమవుతున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కన్నేసిన సంగతి తెలిసిందే. అది చాలదన్నట్టుగా ఈ ఎస్ ఐ కుంభకోణం కూడా తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో  వైద్య రంగంలో సంచలనం సృష్టించిన ఔషధాల కొనుగోలులో 10 కోట్ల వరకు గోల్ మాల్  వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ పురోగతికి సాధించింది.



డ్రగ్స్, డ్రెసింగ్ కొనుగోళ్లు వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఏసీబీ పేర్కొంది. మూడేళ్ల కాలంలో రూ. 700 కోట్ల కొనుగోళ్లు జరిపినట్టు సమాచారం. అందులో ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి వాటా రూ. 200 కోట్లు ఉన్నట్టు విచారణలో బయటపడింది. కాగా బినామీ కంపెనీల్లో దేవికారాణి కుమారుడు వాటాదారుడుగ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంమీద ఈ వ్యవహారంలో తవ్వేకొద్ది  అవినీతి బాగోతం బయటపడుతున్నట్టుగా ఉంది. విజిలెన్స్ రిపోర్టులో విస్తు పోయే విషయాలు వెలుగు చూశాయి. ఈ ఇఎస్‌ఐ స్కాంలో ఓ ఛానెల్ ప్రతినిధి కీలకం కావడం విశేషం. కాగా  ఈ వ్యవహారానికి సంబంధించి  అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.




ఈ ఎస్ ఐ ఆర్సీపురం ఆస్పత్రి సీనియర్ అసిస్టెంట్ సురేంద్రబాబు, నాచారం ఆస్పత్రి ఫార్మాసిస్టు నాగలక్ష్మి, లైఫ్ కేర్ ఎండీ సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. వీరందర్ని  చంచల్ గూడ జైలులోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే కార్మిక బీమా వైద్య సేవల డైరెక్టర్ దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, పలువురు ఫార్మాసిస్టులు, ఇతర సిబ్బంది నివాసాల్లో ఏసీబీ  విస్తృతంగా సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆమ్ని మెడికల్ ఎం డి శ్రీదర్ ,నాగరాజు, తేజ్ ఫార్మా కి చెందినా సుధాకర్ రెడ్డి ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలం లో23 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏసిబి అధికారులు ఒక వి6 రిపోర్టర్ నరేందర్ ఇంటిపై కూడా ఏసీబీ సోదాలు జరిపినట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: