నిజానికి డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ రోగులు చాల నరకంగా  అనుభవిస్తుంటారు. వారానికి రెండు మూడు రోజులు ఆస్పత్రులకు వెళ్లడం, నాలుగైదు గంటల పాటు డయాలసిస్‌ చేయించుకొని రావడం చాల కష్టమైన ప్రక్రియ ఇది. ఇకపై ఈ పద్ధతికి అధికమించేదుకు ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకునే పద్ధతికి కేంద్రం శ్రీకారం పలికింది. ‘పెరిటోనియల్‌ డయాలసిస్‌’ అనే పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చ అని తెలియచేసింది.


 ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. పెరిటోనియల్‌ డయాలసిస్‌ బ్యాగు కొనుక్కుని దాని ద్వారా ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చని తెలియచేసింది. అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో పెరిటోనియల్‌ పద్ధతినే అమలుచేస్తున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఆసుపత్రులకు వెళ్లకుండానే తక్కువ సమయంలో డయాలసిస్‌ చికిత్స చేసుకోవచ్చు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులను ఉపయోగించుకొని పెరిటోనియల్‌ డయాలసిస్‌ను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం వెల్లడించింది.


దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం లక్ష మంది ఈ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో తేలింది. 2015లో ఏకంగా 1.36 లక్షల మంది కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణంగా మృతి చందారు అని తెలుపుతున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏకంగా కోటికి చేరింది అంటే నమ్మండి. 


ప్రతి సంవత్సరం మరో లక్ష మంది కిడ్నీ రోగులకు  తోడవుతున్నారు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ముఖ్య  కారణమని వైద్యులు తెలియచేస్తునారు. ప్రస్తుతం  తెలంగాణలో ప్రస్తుతం 3 లక్షల మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో 15 వేల మందికి డయాలసిస్‌ చికిత్స  జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 43, ప్రైవేటు రంగంలో 30 యూనిట్లు డయాలసిస్‌ చేస్తున్నాయి అని తెలిపారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేసినందుకు ఒక్కోసారి రూ.3 వేల వరకు వసూలు చేస్తుండగా, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. 


పెరిటోనియల్‌ డయాలసిస్‌ వల్ల లాభాలు ఏమిటో చూద్దామా మరి .... పెరిటోనియల్‌ డయాలసిస్‌తో రోగికి చాలా కష్టాలు తప్పుతాయి. ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకునే వీలుంది. ఈ చికిత్సని  ఉచితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. పెరిటోనియల్‌ డయాలసిస్‌ బ్యాగును సాధారణ పాల ప్యాకెట్‌లా తీసుకెళ్లొచ్చు. మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో ఈ బ్యాగులను అందుబాటులో ఉంచి సంబంధిత రోగులకు అందజేయాలి కేంద్రం  తెలుపుతుందని . ఈ పద్ధతి వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా రోగి ప్రయాణాలు చేయాల్సిన అవసరం పడదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: