సాధార‌ణంగా బాదం.. బాదం మిల్క్ తెలియ‌ని వారుండ‌రు. బాదం గింజలు బలవర్థకమైన ఆహారం. జలుబు, జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి. బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది. అయితే బాదం మిల్క్‌తోనూ ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి.


గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు వాటి నుంచి బయటపడాలంటే అందుకు ఎన్నో పోషక విలువలు ఆహారపదార్థాలు అందుబాటులో వున్నాయి. అందులో ‘బాదం మిల్క్’ ఒకటి. ఈ మిల్క్’ను ప్రతిరోజూ రెండుసార్లు తాగితే.. కొవ్వుపదార్థాలు తగ్గిపోయి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గుండె దగ్గరున్న రక్తనాళాల్లో అనవసరమైన కొలెస్టిరాల్’ను పేరుకుపోనివ్వకుండా చేస్తాయి. 


అలాగే బాదం మిల్క్ లో విటమిన్ డి, క్యాల్షియం, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా విటమిన్స్, మినిరల్స్, మరియు విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదే. బాదం పాలలో గ్లిజమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఫ్యాట్ చేరకుండా, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసి డయాబెటిక్ ను కంట్రోల్ చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: