సంతాన లేమి సమస్యను అధిగమించడానికి ఇప్పుడు ఆధునిక వైద్యం అందివచ్చింది. 70 ఏళ్ల వయస్సున్న మహిళలు కూడా పిల్లలను కంటున్నారు. కానీ ఆ వైద్యం చాలా ఖర్చుతో కూడుకుంది. లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంది. అయితే పిల్లలను కలగని దంపతులకు రూ. 100 మందుతో తాను సంతాన భాగ్యం కలుగ చేస్తానంటున్నారో వైద్యుడు.


డాక్టర్ రామచంద్ర ప్రకృతి వైద్యుడు. సంతానలేమి సమస్యను అధిగమించేందుకు ప్రకృతిలో అనేక ఔషధాలు ఉన్నాయంటున్నారాయన. పిల్లలు పుట్టని దంపతులు గోధమ గడ్డి రసం క్రమం తప్పకుండా తాగాలని చెబుతున్నారు. 8 రోజులు పెంచిన గోధుమ గడ్డి రసం తాగడం వల్ల పై సమస్యల్లో చాలా వరకూ తొలగిపోతాయంటున్నారు.


ఇందు కోసం అవసరమయ్యే కేజీ గోధుమలు 60-70 రూపాయలు అవుతాయి. అవి నెల రోజులు వస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు పునర్నవ ఆకు రసం కూడా తీసుకుంటే ఫలితాలు బాగా ఉంటాయంటున్నారు. ఈ పునర్నవ ఆకు గ్రామాల్లో విచ్చలవిడిగా దొరుకుతుందని రామచంద్ర చెబుతున్నారు. ప్రకృతి అందించే ఈ ఔషధాల గురించి తెలియక చాలా మంది లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని రామచంద్ర అంటున్నారు.


ప్రకృతి వైద్యం విషయం తెలియక చాలా మంది కానీ ఈ చికిత్సలకు లక్షల్లో ఖర్చు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పుట్టేందుకు అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేదంటున్నారు కేవలం రూ. 100 ఖర్చుతో తాను పిల్లలు పుట్టేలా చికిత్స చేస్తానంటున్నారు. తాను ఒక్క ఏడాదిలోనే దాదాపు పాతిక మంది వరకూ దంపతులకు ఈ చికిత్స ద్వారా సంతాన భాగ్యం కలిగించాలనని చెబుతున్నారు.


ఈరోజుల్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎక్కువగా పీసీఓడీ సమస్య, మహిళలకు పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, క్రమం తప్పి రావడం, గర్భసంచీలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడటం వంటి సమస్యలేనట. మగవాళ్లకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం కూడా మరో కారణంగా కనిపిస్తోందని రామచంద్ర చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: