అవిసె గింజలు పురాతన ఆహారాలలో ఒకటి. రుచిలో పెద్ద ప్ర‌త్యేక‌త ఏమీ లేక‌పోయినా ఈ గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్‌గా చెబుతారు ఆరోగ్యనిపుణులు. అయితే అవిసె గింజలు రుచి మరియు వాసనలను అనేక మంది ఇష్టపడతారు. వీటిని అందరూ ఇష్టపడటానికి మరో కారణం వాటి పోషక విలువలు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజ‌ల‌తో త‌యారు చేసిన నూనెను మ‌నలో చాలా మంది వంట‌ల్లో వాడుతారు. అవిసెగింజల్లో శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు బాగా ఉన్నాయి. 


నిత్యం ఉదయం కొన్ని అవిసెగింజలు తింటే అల్సర్‌ సమస్య తగ్గుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ వంటివి నిండి ఉండే ఈ గింజ‌ల్లో ప్రొటీన్‌, ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు వంటివి ఎక్కువ‌గా ఉంటాయి. దీనివ‌ల్ల డ‌యాబెటిస్‌, క్యాన్స‌ర్‌, గుండెపోటు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే శ‌క్తి ఈ గింజ‌ల‌కు ఉంద‌ని చెప్పొచ్చు. అవిసె గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల‌ ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు.

అదే విధంగా అవిసె గింజ‌ల్లో నిర్దిష్టంగా ఆల్ఫా లినిఒఇక్ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లం దీర్ఘకాలిక గుండె జబ్బుల్లో, కీళ్ళనొప్పులు, ఆస్తమా వంటి స‌మ‌స్య‌ల నుండి ర‌క్షిస్తుంది. అలాగు అవిసె మాస్కును జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అవిసె గింజలు చర్మం పొడిబారడాన్ని తగ్గించడమే కాకుండా స్కిన్‌ని మృదువుగా కూడా ఉంచుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: