ప్రస్తుతం కొన్ని చోట్ల  ప్రభుత్వ  ఆసుపత్రుల్లో మంచి  వైద్యం  లేదు అని చాల మంది ఇబందులను ఎదురుకుంటున్నారు. ఇక ఏ ఆసుపత్రి అయినా సరే స్థాయికి తగ్గట్లుగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యం పెట్టుకొని  ప్రభుత్వం వాటి పైన  దృష్టి పెట్టడం జరిగింది. ఒక వేళా ఆయా ఆసుపత్రుల్లో వైద్యులను నియమించినా కూడా సేవలందించకుండా పైస్థాయి ఆసుపత్రికి పంపించే విధాన వైఖరికి స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే రోగికి ఆయా ఆసుపత్రుల్లో లభిస్తున్న వాటి కంటే మెరుగైన వైద్య సేవలు అవసరము ఉంటే  తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ పైస్థాయి ఆసుపత్రికి పంపించ కూడదు అని అడ్డుకట్ట వేయడానికి నిర్ణయం తీసుకుంది.


ఈ నిర్ణయం తీసుకోవం వాల్ల  రోగులకు మెరుగైన వైద్య సేవలందడంతో పాటు బోధనాసుపత్రుల పైనా అనవసర భారం తగ్గుతుందని అనే భావనలో ఉంది.  ముఖ్యంగా వైద్య విధాన పరిషత్ (వీవీపీ) పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్ సీలు), ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో వైద్య సేవల అమలు నిబంధనలను అన్నిటిని   సర్దుబాటు చేసుకోవాలని తెలియచేసింది. ఈ  నేపథ్యంలో  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ  ఆదేశాల మేరకు వీవీపీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రమేశ్ రెడ్డి కీలక మార్పులపై బాగా దృష్టి పెట్టడం జరిగింది. 


ఇక  ప్రభుత్వం సుమారు 1200 కొత్త వైద్యపోస్టులను వీవీపీ ఆసుపత్రులకు మంజూరు చేయడంతో పాటు, సుమారు 600 పోస్టులను భర్తీ కూడా చేయడం జరిగింది. ఇంకా  మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉంది. ఇక  కొన్ని ఆసుపత్రుల్లో గైనకాలజిస్టులే కేవలం ముగ్గురు నలుగురు ఉండగా.. చాల ఇబ్బందులు పడుతున్నారు.  ఆసుపత్రుల్లో ఈ తరహా లోటుపాట్లను ప్రభుత్వం గుర్తించింది. వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బందిని  కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రి స్థాయిని బట్టి వారు అక్కడే  తప్పక వైద్య సేవలు అందరికి అందించే విదంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


ఈ తరుణంలోనే  మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 20 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్  విడుదల చేయడం జరిగింది. ఆసక్తి , అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలియచేశారు. ఇంకా  అదే రోజు ముఖాముఖి ఇంటర్వ్యూ, 30 ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని కళాశాల సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ తెలియచేయడం జరిగింది. మొత్తంగా ఐదు ఆచార్య, 10 సహ ఆచార్య, 5 సహాయ ఆచార్య పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆచార్యులకు నెలకు రూ.1.90 లక్షలు, సహఆచార్యులకు రూ.1.50 లక్షలు, సహాయ ఆచార్యులకు రూ.1.25 లక్షల వేతనం ఉంటుంది అని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: