యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము.  సాధారణంగా వంటింట్లో యాలకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రకాల వంటకాలతో పాటు టీలోనూ వీటిని వాడుతుంటారు. యాలకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు... కాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకుంటాయని అంటున్నారు. డిప్రెషన్ నుంచీ బయటపడాలంటే ఏ యాలకుల టీయో, పాలో తాగితే సరి సూచిస్తున్నారు. అలాగే యాల‌కుల‌తో అధిక బ‌రువుకు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.


యాల‌కుల‌ను పొట్టు తీసి వాటిలో ఉండే విత్త‌నాల‌ను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నాన‌బెట్టి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగి ఆ విత్త‌నాల‌ను తినేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది. రోజూ మూడు పూట‌లా భోజ‌నం చేయ‌డానికి ముందు యాల‌కుల‌ను కొన్నింటిని నోట్లో వేసుకుని న‌మిలి మింగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువుకు సులువుగా చెక్ పెట్ట‌వ‌చ్చు.


అదే విధంగా యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి, పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపో తాయి. అలాగే సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగపడతయంటా.వాటిలోని సినియోల్ అనే కాంపౌండ్... పురుషుల్లో నరాల పటిష్టతకు చేస్తుంది. బీపీని తగ్గించేందుకు యాలకులు బాగా పనిచేస్తాయి. దీంతో పాటు యాలకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు గుండెకు మేలు చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: